ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి …ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.. ఏఐటీయూసీ నంద్యాల జిల్లా ఆర్గనైజేషన్ సెక్రెటరీ శివ బాలకృష్ణ. దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని, ప్రైవేటు కరణకు పాల్పడుతుందని, దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు కార్మికుల సిద్ధం కావాలని, ఏఐటీయూసీ నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శివ బాలకృష్ణ తెలిపారు ..
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఏఐటియుసి మండల కార్యదర్శి జి రామకృష్ణ అధ్యక్షతన ఏఐటియుసి జాతీయ మహాసభల కరపత్రాలను విడుదల చేశారు..ఈసందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ,,కార్మిక వర్గం శత దశాబ్ద కాలంగా అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న, 29 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దుచేసి, నాలుగు కార్మిక కోడ్స్ ను అమలు చేసే ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు .ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులు ,ఇన్సూరెన్స్, రక్షణ ,బొగ్గు, ఏఈర్పోర్టులు, ఓడరేవులు, రైల్వేలు, అన్నిటిని ప్రైవేటు పారిశ్రామికవేత్తలైన ఆదాని, అంబానీ లీలకు అప్పగిస్తుందని ఆయన తెలిపారు.అంతేకాకుండా రైల్వే,లైన్లు, ఓడరేవులను, రోడ్లు టెలిఫోన్ టవర్లు, విద్యుత్ టవర్లు ఇలాంటి కీలక మౌలిక సదుపాయాలతో పాటు ప్రభుత్వ స్థిరాస్తులన్నిటిని అమ్మకానికి పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు .
ఇటువంటి విపత్కర పరిస్థితులలో దేశం నలుమూలల నుండి కార్మిక వర్గం, అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని, పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించేందుకు ,కార్మిక వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోషెందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు .దేశంలో ఈనెల 16 నుండి 29వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలో అలెప్పి నగరంలో ఏఐటి యు సి జాతీయ మహాసభలు జరుగుతున్నాయని, ఈ మహాసభలలో “బిజెపి హటావో దేశ్ కి బచావో “అనే నినాదానికి పదును పెట్టి కార్మిక పరిశ్రమలను ,కార్మిక రంగాలను కాపాడుకునే దిశగా పోరాటాలు జరిపేందుకు ఉద్యమ కార్యాచరణ రూపుదిద్దుకుంటున్నాయని ఆయన తెలియజేశారు.ఈ మహాసభలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్నాయని, ఈ మహాసభలకు దేశం నలుమూలల నుండి కార్మిక నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటారని, ఈ మహాసభల జయ ప్రధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొలిమిగుండ్ల సిపిఐ నాయకులు సూర్యనారాయణ, ఏఐటీయూసీ నాయకులు బి మహేష్, విజయచంద్ర , విజయ్ తదితరులు పాల్గొన్నారు..