పల్నాడు జిల్లాలో వైసీపీకి వణుకు పిన్నెల్లి అరెస్టుతో క్యాడర్లో భయందోళనలు..!
తురకా కిషోర్ అంటే పట్టణంలో సామాన్యులు సైతం హడలిపోయే వారు.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో.. ఎవ్వరికీ తెలియని పరిస్థితి..
గుంటూరు: పల్నాడులోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల వైసీపీ క్యాడర్‌లో రోజురోజుకూ నిరుత్సాహం ఆవరిస్తోంది. రెండు రోజుల క్రితం గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గత వైసీపీ పాలనలో జరిగిన లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలకు దిగటంతో గురజాల వైసీపీ శ్రేణులకు మతిపోయినంత పనైంది.
ఐదేళ్ల అధికారం అనుభవించి ఓడిపోగానే స్వపక్షంలో విపక్షంలా మహేష్ రెడ్డి మాట్లాడటాన్ని నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతలోనే బుధవారం నాడు హైకోర్టు ధర్మాసనం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ తిరస్కరించడంతో.. అరెస్టుకు పోలీసులు సిద్దం అయ్యారు . అప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు వెంటనే అరెస్టు చేయటంతో వైసీపీ క్యాడర్ & తన అనూచార వర్గంలో భయం వెంటాడుతుంది. అప్పటికే కొందరు నియోజకవర్గాలు వదిలి తల దాచుకున్న సంఘటనలు వున్నాయి.
దిక్కు తోచని స్తితిలో పిన్నెల్లి అనుచర వర్గం..!
ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం, పిన్నెల్లి ఓటమితో కుంగిపోయిన క్యాడర్ కు ఆయనను అరెస్టు చేయటంతో భవిష్యత్తులో నియోజకవర్గంలో తమ పరిస్థితి ఏంటని ఎవరికి వారే మధన పడుతూ కంటినిండా నిద్రపోకుండా భయం భయం గా గడుపుతున్నారు. వైసీపీ పాలనలో పిన్నెల్లి బ్రదర్స్ తర్వాత హవా నడిపించిన మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్, బూడిద శ్రీను, శర్మలతోపాటు మరి కొందరు పిన్నెల్లి ప్రధాన అనుచరులు కౌంటింగ్ రోజు నుండి నుంచి నియోజకవర్గంలో కనిపించడం లేదు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ వారు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఎవరి ఆస్తి ఎవరి పేరున మారుతుందో తెలియదు. పోలీసులు మాత్రం అమాయకులపై కేసులు పెట్టి హింసించడం, టీడీపీ వారిపై దాడులు చేయించడం, బాధితులపై పోలీసులతో తప్పుడు కేసులు నమోదు చేయడం, భారీగా బెదిరించడాలు అన్నీ ఇన్నీకావు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సొంత కార్యాలయంగా మార్చుకొని వందల సంఖ్యలో తప్పుడు రిజిస్ట్రేషన్ లు చేయించిన సంఘటనలు.. ఎన్నో విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు కోకొల్లలు.
వారి చర్మం ఒలిచి.. పిన్నెల్లికి చెప్పులు కుట్టిస్తా..
తురకా కిషోర్ అంటే పట్టణంలో సామాన్యులు హడలిపోయే పరిస్తితి ఏర్పడింది. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఆయన మాటలకు హద్దు లేకుండా పోయింది. ఎలక్షన్ ను ముందు కొన్ని నెలల క్రితం మాచర్ల పట్టణంలో.. వైసీపీ పార్టీ బహిరంగ సభ లో తురకా కిషోర్ మళతాడుతూ.. యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి చర్మం వలిచి పిన్నెల్లి అన్నకు చెప్పులు కుట్టిస్తా.. నంటూ.. ప్రగల్భాలు పలికారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. బూడిద శ్రీను మాచర్ల రూరల్ మండలానికి చెందిన ఏలారు. శర్మకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ అక్రమం జరగదు అన్న పేరుంది. ఇలాంటి వారిని పెంచి పోషించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి భారీ మూల్యం చెల్లించక తప్పలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పిన్నెల్లి అనుచరులుగా ముద్రపడిన వారందరికీ ప్రస్తుతం కంటిమీద కునుకు లేకుండా పోయింది. మొత్తం మీద మాచర్లలో వైసీపీ క్యాడర్ వణికిపోతుండగా.. గురజాల నిరాశ.. , నిస్పృహల్లో.. కొట్టుమిట్టాడుతోంది.