- సౌదీలో ఘోర బస్సు ప్రమాదం
- 42 మంది సజీవదహనం..
- హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం
మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సుట్యాంకర్ నుండి మంటలు చెలరేగి బస్సుకు అంటుకొని యాత్రికులు సజీవదహనంమృతుల్లో 21 మంది మహిళలు, 11 మంది పిల్లలను గుర్తించిన అధికారులుబస్సు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేని స్థితిలో దహనమైన మృతదేహాలుమృతుల్లో హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం.. ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి
*సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టు వస్తున్న వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈ మృతుల కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతోపాటు వారి కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ తోను, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నేడు మాట్లాడడం జరిగింది.
సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్లోను ఏర్పాటు చేసినట్టు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో ఈ క్రింది నెంబర్ల ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు**+91 79979 59754**+91 99129 19545*
సౌదీ బస్సు ప్రమాదం.. మృతుల వివరాలపై ఇంకా రాని స్పష్టత !సౌదీ బస్సు ప్రమాదంలో HYD వాసులు చనిపోయినట్లు వార్తలు రావడంతో యాత్రికుల బంధువులు ట్రావెల్ ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ ద్వారా అసిఫ్ నగర్ జిర్ర ప్రాంతం నుంచి 16మంది, మెహిదీపట్నం ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24మంది, మరో ఏజెన్సీ నుంచి ఇద్దరు సౌదీ వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై MP అసద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు.
సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది సజీవదహనం.. మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్‌కు చెందిన 16 మంది.. మృతులు: రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీగా గుర్తింపు











