ఈ కాశీనాయన క్షేత్రాలు నిజమైన అన్నదాన స్ఫూర్తిని మనకు తెలియజేస్తాయి.. ఏదో మొక్కుబడిగా కాకుండా అన్ని రకాల అల్పాహారాలు మరియు స్వీటు తో సహా ఎన్నో రకాల భోజనాలు పండ్లు అక్కడకు వచ్చిన భక్తులకు సమర్పిస్తారు.. అంతేకాకుండా అక్కడ వృద్ధాశ్రమాలను కూడా నడుపుతూ ఉంటారు.. చాలామంది వృద్ధులు అక్కడనే నివాసం ఉంటారు..
నేను నంద్యాల దగ్గరలోని ఓంకార క్షేత్రంలో ఉన్న కాశీనాయన ఆశ్రమాన్ని చూశాను.. అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐతుంది ఆ భోజనాలు చూస్తే.. వేడివేడిగా మనకు ఎంతో ఆప్యాయంగా వడ్డిస్తారు..
నేను వెళ్ళినప్పుడు అక్కడ నేను ఆపరేషన్ చేసిన ఒక పేషెంట్ అక్కడ సేవకుడిగా ఉన్నాడు .. అతను నన్ను గుర్తుపట్టి ఎంతో గౌరవంగా ఆప్యాయంగా పలకరించి అక్కడ అందరికీ పరిచయం చేశాడు..
కాశి నాయన ఆశ్రమాలు అనేవి ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరియు పుణ్యక్షేత్రాల్లో స్థాపించబడ్డాయి.
ఈ ఆశ్రమాలు కాశి నాయన గారి భక్తుల ఆధ్వర్యంలో నిత్యాన్నదానాలు, గోసేవ, దేవాలయాల పునర్నిర్మాణం మరియు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ముఖ్యమైన ఆశ్రమాలు మరియు క్షేత్రాలు
- జ్యోతి క్షేత్రం: కడప జిల్లా, బద్వేలు నియోజకవర్గంలో ఉన్న ఈ ఆశ్రమం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కాశి నాయన గారి సమాధి స్థలం ఉంది.
- సీతారామపురం ఆశ్రమం: నెల్లూరు జిల్లా సీతారామపురంలో ఉంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ సీతారాముల దేవాలయం వంటి అనేక దేవాలయాలు ఉన్నాయి.
- ఆత్మకూరు ఆశ్రమం: నెల్లూరు జిల్లా, తిరునల్ల తిప్ప ప్రాంతంలో ఉంది. ఇందులో శివుడు, గాయత్రీ మాత, అయ్యప్ప స్వామి, సరస్వతి మాత విగ్రహాలు ఉన్నాయి. ప్రతి రోజు నిత్యాన్నదానం జరుగుతుంది.
- ఇతర ప్రాంతాలు: తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రెండు వందలకు పైగా ఆశ్రమాలు మరియు గుళ్ళు పనిచేస్తున్నాయి. ఇవి గోసమర్పణ, నిత్యాన్నదానం, పాడుబడిన ఆలయాల జీర్ణోద్ధరణ వంటి సేవలు అందిస్తున్నాయి.
ఆశ్రమాల ప్రత్యేకతలు..
- ప్రతి ఆశ్రమంలో నిత్యాన్నదానం జరుగుతోంది, అనేక మంది భక్తులు ప్రతి రోజు భోజనం చేస్తున్నారు.
- గోసంరక్షణ, పాడుబడిన దేవాలయాలకు జీర్ణోద్ధరణ, దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తున్నాయి.
- అనాధ వృద్ధులకు ఆశ్రయంగా ఉండేందుకు కూడా కాశి నాయన ఆశ్రమం సేవలు అందిస్తోంది.
మానవత్వం అనేది ఇంకా మనలో ఉంది.. ఇంకా ఈ భూమి పైన విరాజిల్లుతుంది అనేకి ఈ క్షేత్రాలే నిదర్శనం…
మీ దగ్గరలో ఉన్న క్షేత్రం ఏమిటి? మీరు ఎప్పుడైనా నిజంగా దర్శించారా? లేదా దర్శించాలని అనుకుంటున్నారా అయితే తప్పకుండా దర్శించండి..
మీరు ఎప్పుడైనా ఈ కాశీనాయన క్షేత్రాల దర్శనం చేశారా?
మీకు వీలుంటే తప్పకుండా ఒక్కటి అయినా గాని సందర్శించండి…
మరి దర్శిస్తే నాకేంటి? నాకేంటి? అని అడగకండి…
మనలో సేవా భావం అనేది కలుగుతుంది.. జస్ట్ ఆ అనుభూతిని పొందండి..
అది మీకు సమయం వచ్చినప్పుడు మార్గదర్శనం చేస్తుంది…
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు