ప్యాపిలి నంద్యాల జిల్లా
ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి. CITU
ఆశ వర్కర్స్ గత 20 సంవత్సరాలుగా పేద ప్రజలకు, గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు,వివిధ రోగాలతో ఉండినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న ఆశ వర్కర్స్ కు కనీస వేతనాలు పెంచాలని PHC సెంటర్ ఇన్చార్జి మాధవి మేడం గారికి మో మొ రాండం ఇవ్వడం జరిగినది.CITU ప్యాపిలిమండల ప్రధాన కార్యదర్శి S.A. చిన్న రహిమాన్, సహాయ కార్యదర్శి పద్మశాలి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకులు ఆశ వర్కర్స్ వేతనాలు పెంచుతామని వాగ్దానం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్న నేటికీ ఆశా వర్కర్స్ కు వేతనాలు పెంచడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో పోటీపడి పిల్లల వైద్య ఖర్చులు విద్యార్థులు విద్య ఖర్చులు భరిస్తూ కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందన్నారు.
ఆశా వర్కర్స్ కు అన్ని రకాల జాతీయ సెలవులు పండగ సెలవులు వారంతపు సెలవులు క్యాజువల్ సెలవులు మెడికల్ లీవ్స్ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దహన సంస్కారాలకు 20వేల రూపాయలు చెల్లించాలని ఫైవ్ జిబి మొబైల్స్ సిమ్ కార్డు ఇవ్వాలని. నాన్నమైన యూనిఫారం ఇవ్వాలని పిహెచ్సి లకు వెళ్లిన ప్రతి సందర్భంలో టీఏడీఏ ఇవ్వాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఏఎన్ఎం జి ఎన్ ఎం శిక్షణ పొందిన ఆశా కార్యకర్తలకు పర్మినెట్ పోస్టులు సందర్భంగా ప్రాధాన్యత ఇవ్వాలి.
పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఆశా కార్యకర్తలు నియామకం పెంచాలని ప్రభుత్వమే నియామకాలు చేపట్టాలని వారు కోరారు. గిరిజన గూడెంలలో పనిచే స్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను పాఠశాలల్లో మార్పు చేసి ఆశాలతో పాటు సమానంగా వేతనాలు ఇవ్వాలని ప్రమాదంలో గాని అనారోగ్యంతో గాని మరణించిన ఆశ కార్యకర్త కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆశ వర్కర్స్ పై రాజకీయ జోక్యం లేకుండా చూడాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆశా కార్యకర్తలకు వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ షమీముల్లా గారు కెవిపిఎస్ మండల నాయకులు రాజకుమార్, ప్రతాప్, భాగ్యలక్ష్మి, కృష్ణకుమారి, దేవమ్మ, పీరాంబి, కవిత, కమల, సునీత, నాగవేణి, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.