- మీ ఇంట్లో మహిళలు లేరా, ఏంటా మాటలు.
- మహిళలు సంకరజాతి అనేందుకు మీకు నోరేలా వచ్చింది.
- మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం కోసం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం.
- చెల్లి జోలికి వస్తే నరికేయాలి గాని నువ్వేం చేశావ్ జగన్.
- ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
అన్నమయ్య కీర్తనలు, మొల్ల తెలుగులో రచించిన రామాయణం, విశ్వనాథ సత్యనారాయణ ఇలా ఎంతో మంది రచయితలు, కవులు ఇక్కడి పుణ్య భూమిలో ఉంటూ తెలుగు భాషను ముందుకు తీసుకెళ్లారు. తెలుగు భాష ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానుభావులు ఉన్నారు.
అంత చక్కటి తెలుగు భాషను వైసీపీ నాయకులు బూతులతో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం భాధేస్తోందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
బుధవారం హైదరాబాద్ ఎన్ టి ఆర్ ట్రస్ట్ భవనంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇక్కడే చదివారు, ఈ స్కూల్ స్టూడెంటే, మహిళలను పిచాసులు, సంకరజాతి అని అంటారు. మా జాతి సంకరజాతి అయితే మీ మహిళలు, మీ కుటుంబ మహిళలు ఏ జాతి మహిళలు అని బైరెడ్డి శబరి ప్రశ్నించారు.
అమరావతి మహిళలు అందరూ వేశ్యలు అంటారు, ఇదే మాట మీ చెల్లిని, తల్లినీ అంటే ఊరుకుంటారా, తిరుపతి, కడపలో పిహెచ్ ఈ లు చేశాం అంటారు. శాంతియుతంగా నిరసన చేసే మహిళలపై బీరుబాటిళ్లతో దాడి చేస్తారు, ఇదా రాజకీయం అంటే మీరు మహిళలను కించపరిచే రాజకీయాలు చేయాలని అనుకుంటే మీకు మూడినట్టేనని వైసీపీ నాయకులకు బైరెడ్డి శబరి హెచ్చరించారు.
తల్లికి, చెల్లికి గౌరవం ఇవ్వని ఆనాటి సీఎం వై ఎస్ జగన్ ఇప్పుడు మాత్రం మహిళలను గౌరవిస్తారని, మన రాష్ట్రంలో మేము మహిళలం కాదు, కేవలం వై ఎస్ భారతీ మహిళా అనుకుంటున్నారేమో అని ఆమె అన్నారు. వైసీపీలో ఉన్నవారు కొందరు వై ఎస్ షర్మిల గురించి నోరు పారెసుకున్నా స్పందన ఉండదు, ఏదో జాతి, ఏదో నీతి, నీతిలేని జాతిలేని మనిషి చీర కట్టుకున్న మగాడు అని ఎవడో వైసీపీ కార్యకర్త షర్మిల గురించి మాట్లాడుతుంటే ఏ అన్నకైనా నరికేయాలి అనే కోపం వస్తుంది. తల్లి గురించి కూడా మాట్లాడినా కానీ జగన్ ఏమి మాట్లాడలేదు. స్పందించలేదు. ఇన్ని జరుగుతున్నా, మాట్లాడుతున్నా ఆ స్కూల్ ప్రిన్సిపాల్, గురుగారు ఎందుకు, ఏమీ మాట్లాడడం లేదని ఆమె నిలదీశారు.
ఈనాడు తెలుగుదేశం పార్టీలో మహిళలపై ఎవరు సోసియల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని, అది టీడీపీ గొప్పదనం, టీడీపీ మహిళలకు పెద్ద పీఠ వేస్తున్నారని, ఆనాడే దివంగత ఎస్ టి ఆర్, నేటి సీఎం చంద్రబాబు మహిళలను గౌరవిస్తు ఆస్తిలో సమాన వాటా, స్థానిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ కల్పించి భరోసా ఇచ్చారని, మహిళలపై అఘాత్యాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే సీఎం చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు.
మహిళలపై దాడులు చేసిన, కించపరిచే విధంగా మాట్లాడినా చర్యలు తప్పవని, మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లుతామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్పష్టం చేశారు