త్వరలో నంద్యాల ఎంపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ – మాజి ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ప్రజల సమస్యలు విని వాటిలో ఫోన్ ద్వారా అయ్యేవాటిని అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం, మరికొన్ని దరఖాస్థులు ఆయా సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకొనివెళ్లి పరిష్కరించేందుకు కృషి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పారు.
ఆదివారం నంద్యాల బొమ్మలసత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చొరవతో ప్రజల సమస్యలు పరిష్కరించాలన్న ప్రజా ధర్బార్ నిర్వహించాలని నిర్ణయం ఎంపీ శబరి తీసుకోవడం మంచి పరిణామం అన్నారు. నాలుగు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలందరి నుంచి వినతులు తీసుకొని ఆయా శాఖల అధికారులకు ఎంపీ ద్వారా అందజేసి వాటిని పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు తమ సమస్యలు వినతి పత్రం ద్వారా నంద్యాల ఎంపీ కార్యాలయంలో త్వరలో జరిగే (గ్రీవెన్స్ ) ప్రజాదర్బార్ లో అందించవచ్చని, వాటి పరిస్కారం కోసం ఎంపీ శబరి పనిచేస్తారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు నరహరి విశ్వనాధ్ రెడ్డి, బి ఎస్ ఎన్ ఎల్ సలహా కమిటీ సభ్యులు పెరుమాళ్ళ విజయకుమార్, శ్రీనివాస్ యాదవ్, మాజీ జడ్ పి టీ సీ నాగేశ్వరావు, కోడూరు సంజీవరెడ్డి, అజయ్, గణపం పుల్లారెడ్డి, 32 వార్డు టీడీపీ ఇంచార్జి కొండబోయిన శ్రీనివాస్ రావు, రైల్వే బోర్డు సలహా కమిటీ సభ్యుడు శ్రీనివాసయాదవ్, రవిబాబు, నాగేశ్వరరెడ్డి, గోరుకల్లు ఎరుకలయ్య నేరవాడ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.