నల్లమల అటవీ ప్రాతం రోళ్ళపెంట సమీపంలో ట్రాఫిక్ జామ్ అయింది . రాత్రి నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురకుంటున్నారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని రోళ్లపెంట ఘాట్లో శుక్రవారం 29 – 10- 2022 రాత్రి రెండు గంటల 30 నిమిషాలకు కర్నూలు నుండి గుంటూరు కు..
సజ్జలలోడుతో వెళ్తున్న లారీని ఘాట్ ఎక్కే సమయంలో ఆర్టిసి బస్సు ఓవర్టేక్ చేయడంతో బస్సు లారీకి తగులుతుందేమో అని లారీ డ్రైవర్ కాస్త ఎడమవైపుకు తిప్పడంతో లారీ ఘాట్లో ఇరుకపోయింది .
కర్నూలు గుంటూరు శ్రీశైలం ప్రాంతాల నుండి వచ్చు వాహనాలు రాత్రి 2;30 నుండి అక్కడే నిలిచిపోవడంతో ఫోన్లు పనిచేయక అవస్తాలు పడ్డారు .
కొందరు బైక్ మార్గం ద్వారా వచ్చి ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆత్మకూరు ఎస్సై కృష్ణమూర్తి అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను తొమ్మిది గంటల పది నిమిషాలకు క్లియర్ చేశారు.
అయితే ఏడు గంటల పాటు ఫారెస్ట్ లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇలా ఎన్నో ఏళ్లతరబడి వాహణదారులు , ప్రయాణికులు ఈ సమస్యను ఎదురుకుంటున్నారు .
అధికారులు మాత్రం ఏమి చేయలేని పరిస్తితి . దట్టమైన నల్లమల అటవీ , అందులోనూ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు కావడంతో .. అటవీశాఖ అనుమతులు రావడంలేదు ..
ఇలా ఎన్ని సంవత్సరాలు ప్రయాణికులు , వాహన దారులు నరకాయతనా అనుభవించాలో ఎలియని దుస్థితి ఏర్పడింది .
నల్లమల అడవి ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ జామై పర్యాటకులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు..
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ఒక్కో సమయంలో త్రాగడానికి నీరు తినడానికి తిండి లేక అలమటించిన రోజులు ఉన్నాయి. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారిన ఈ రోడ్డు దుస్థితి మాత్రం మారడం లేదు.
కర్నూలు నుంచి విజయవాడకు వెళ్లాలంటే ఇదే ప్రధానమైన దారి, కానీ అడవి ప్రాంతంలో వాహన నడపడానికి డ్రైవర్లకు ఒక నరకయాదనగానే ఉంటది..
రోడ్లపెంట దగ్గర ఉన్న మూడు మలుపులు ఎక్కడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతేకాక భారీ భారీ వాహనాలు రావడం అవి కట్ కాక ఇబ్బందులు పడుతుంటారు.
హెవీ లోడుతో ఉన్న లారీలు సైతం ఇదే రోడ్లో ప్రయాణం చేయాల్సిందే.. కానీ అవి ఎక్కే క్రమంలో ఒక్క క్షణం ఆగింది అంటే అదే వాహనం రివర్స్లో కిందికి పోయి లోయల పడిన సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి.
ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు చోద్యం చూస్తూనే.. ఉన్నాయి తప్ప రహదారిని మాత్రం అభివృద్దికి నోచుకోవడం లేదు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ఆత్మకూరు నుంచి గుంటూరుకు వెళ్లే రోడ్డు ఇది కేజీ రోడ్డు అంటారు కర్నూల్ నుంచి గుంటూరు రోడ్డు అని అర్థం. ఈ రోడ్డులో ప్రయాణం అనేది అంత సులభతరం కాదు.
ఒక నరకయాతన మాదిరి ఉంటుంది ప్రయాణికులు డ్రైవర్లు ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయం భయంగా గడుపుతారు..
పులులు దాడి చేసే ప్రమాదం
ఏ టైంలో ఏమి జరుగుతుందోనన్న భయం వెంటాడుదునే ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇంకా వెనక్కి వెళ్లలేని పరిస్థితి, ముందుకు వెళ్లలేని పరిస్థితి , ఏర్పడుతుంది.
మరొక విషయం అక్కడ జరుగుతున్న సంఘటన అధికారులకు తెలియజేయాలన్న అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. బయలుదేరిన వ్యక్తి వాళ్ళ కుటుంబంలో కూడా..
ఆందోళన చెందుతుంటారు. ఫోన్ సిగ్నల్స్ తగలవు ఈ టైంకి రావాల్సిందే కదా ఇంకా రాలేదన్న ఎదురుచూపులు ఉంటాయి.
శ్రీశైలం నాగార్జున సాగర్ నల్లమల టైగర్ రిజర్వు కావడంతో పులులు దాడి చేసే ప్రమాదం ఉంటుంది. ప్రయాణి కులంతా ఒకే చోట భూమి కూడా ఉంటారు.
ఏ క్షణాన ఏ అడవి మృగం దాడి చేస్తుందో.. తెలియని పరిస్థితి , ప్రభుత్వాలు మాత్రం రోడ్డు విస్తరణ పనులు చేయడం లేదు,
రోడ్డు విస్తరణ పనులు చేయాలంటే సెంట్రల్ నుంచి పర్మిషన్ రావాలంటే సాద్యం కటంటూ .. ఎమ్మెల్యేలు సాగుతో దాటవేస్తారు .
ఈ రహదారి విస్తరణ ఎప్పుడు జరుగు తుందో.. ఇక్కడ ప్రజల తలరాతలు ఎప్పుడు మారుతాయో.. వేచి చూడాలి.