నా రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు..
సినీహీరో సుమన్ ప్రస్తుతం నాకురాజకీయాల్లోకి రావాలని ఆలోచన లేదని అన్నారు గతంలో..వాజ్ పేయు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాల్లో ఉన్నానని అన్నారు.
అప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో నా రాజకీయం జీవితం కూడా గడిపానని అన్నారు. నాకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు అని అన్నారు.
ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని కాదు నేను ఎప్పుడైనా ఇదే మాట చెబుతాను అని అన్నారు.
రాజకీయాలు , సినీ ఇండ్రస్ట్రీ పై సంచలన వాక్యలు
ప్రస్తుత రాజకీయాలపై సినీ హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఓ ప్రైవేటు షాపును ప్రారంభించడానికి వచ్చిన సుమన్
మీడియా సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారతదేశ రాజకీయాలు బ్రస్టు పట్టాయి..
మీరు రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారా… అని మీడియా బృందం అడిగారు. నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది కానీ నాకు చాలా సందేహాలు ఉన్నాయి
వాటికి సమాధానం దొరికితే .. అప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపుతా నన్నాడు భారత దేశం రాజకీయ వ్యవస్థలో సమన్యాయం లేదన్నాడు.
రాజకీయ నాయకుడికి వక రూల్
ఒక రాజకీయ నాయకుడు జైలు జీవితం గడుపుతూ రాజకీయాల్లో పోటీ చేయొచ్చు అది కూడా ఎమ్మెల్యేగా , లేదా ముఖ్యమంత్రి స్థానానికి కూడా పోటీ చేయడానికి హక్కులు కల్పించారు.
అదే సామాన్య మానవుడు జైలులో ఖైదీగా ఉన్నవాడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎందుకు హక్కులు కల్పించ లేకపోతున్నారు.
అంటే ఉన్నోడికి ఓక రూల్.. పేదోడికి మరొక రూల్ దీనిపై నాకు సమాధానం కావాలి అని సినీ హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
నాయకులు రెండు చోట్ల పోటీ చేయవచ్చా..
రాజకీయ నాయకుడు ఒకచోట ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మరొకచోట ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అంటే రాజకీయ నాయకుడు రెండు చోట్ల పోటీ చేయొచ్చా..
సామాన్య మానవుడు మాత్రం ఒక ఓటరు ఒకే చోట ఓటు వేయాలా.. దానికి నాకు సమాధానం కావాలి .
ఇలా నాకు 90 సందేహాలు ఉన్నాయి మీకు రెండు మాత్రమే వివరించాను అని సినీ హీరో సుమన్ అన్నారు.
మంత్రి పదవులు కేటాయించడంపై
రాజకీయాల్లో ఎవరెవరు అయితే ఏ శాఖకు పనికొస్తారో ఎవరి నైపుణ్యానికి ఏ శాఖ అయితే పని చేస్తుందో వాడి వ్యక్తిత్వము ఎలా ఉంది వాడి తిరిగే విధానం ఏది?
వాడికి ఏ మంత్రి పదవి ఇస్తే సరిపోతుందన్న ఆలోచన నాయకులకు రావాలన్నారు. ఉదాహరణకు కింజరపు రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు కి వ్యవసాయం పట్ల మంచి ఆసక్తి ఉంది ,
అతనికి చాలా అనుభవం ఉంది. అలాంటి వ్యక్తికి వ్యవసాయ మంత్రిగా ఇవ్వకుండా అంటే భూమిపై అవగాహన ఉన్న వ్యక్తికి తీసుకుపోయే
ఆకాశంలో తిరిగే విమానాల శాఖ మంత్రిగాఇవ్వడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read నల్లమలకు అడవి దున్న – Adavi Dunna