నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కొత్తపేట మరియు ఏకలవ్య నగర్ లో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పంపింణీ చేశారు. మొదటగా అయన వైసిపి నాయకులు ఇళ్ళకు వెళ్లి పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మేము పార్టీలకతీతంగా పని చేస్తాము అభివృద్ధి అందరికీ సమానంగా పంచుతాము అందుకు ఉదాహరణ నేడు మొదటగా వైసిపి నాయకుల ఇళ్లకు వెళ్లి పింఛను కార్యక్రమం ప్రారంభించామని అన్నారు.
ఎవరైతే వైయస్సార్ పార్టీలో ఉంది తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు గురి చేసారో వారి వద్దకే వెళ్లి పింఛన్ పంపిణీ చేశామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఓడిపోగానే ఇళ్లలో కూర్చోడం కాదని ప్రజల్లోకి వచ్చి తిరగాలని.. మేము చేస్తున్న సంక్షేమాలను చూడాలి అని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అలగే నియోజకవర్గంలో శ్రీశైలం, మహానంది, దేవస్థానంలో భారీగా అవినీతి జరిగిందని అలాగే ఆత్మకూరులో మున్సిపాలిటీ, వర్ధన్ బ్యాంకులలో అవినీతికి పాల్పడ్డారని త్వరలోనే వాటిని బయటికి తీసి అవినీతికి పాల్పడ్డ వారి సంగతి తేలుస్తామన్నారు.
శిల్పా చక్రపాణి రెడ్డి హిమాలయాల్లో దాక్కున్న వదిలే ప్రసక్తి లేదని.. నీ అవినీతి మొత్తం బయట పెట్టి నిన్ను అరెస్టు చేసి తిరుతామన్నారు.
Also read this