శ్రీశైల క్షేత్రాన కొలువైన కష్టాలు
-శ్రీశైల దేవస్థానంలో భక్తుల ఇక్కట్లు.
-సమస్యల పరిస్కారానికై శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి దృష్టికి తీసుకెళ్ళిన మానవహక్కుల కౌన్సిల్ మరియు మీడియా ఆర్ఘనైజేషన్ ప్రతినిధులు.
శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు ను బుధవారంనాడు మానవహక్కుల కౌన్సిల్ మరియు మీడియా ఆర్ఘనైజేషన్ (హెచ్.ఆర్.సి.ఎం.ఓ) ప్రతినిధులు కలవడం జరిగింది. వివరాలలోకి వెళితే (హెచ్.ఆర్.సి.ఎం.ఓ) జాతీయ సమన్వయకర్త కె. కార్తీక్ కుమార్, శ్రీశైలం మండలం కార్యదర్శి బి.ఎన్.వి. కుమార్, శ్రీశైల దేవస్థానం జరుగుతున్న అవక తవకల గురించి, భక్తులు పడుతున్న ఇబ్బందులగురించి వివరించారు.
-ట్రాఫిక్ వల్ల భక్తుల ఇక్కట్లు.
ఈ సృష్టి లోనే ఎక్కడా లేని విధంగా ఆదిశక్తి,పరమ శివుడు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లుగా వెలసిన శ్రీశైల మహా పుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకు అనేక ప్రాంతాలనుండి, ఇతర రాష్ట్రాలనుండి మరియు ఇతర దేశాలనుండి అనేకమంది భక్తులు వస్తుంటారు. అలా వచ్చిన వారికి శ్రీశైలంలో ట్రాఫిక్ ఇబ్బందులు,వసతి సౌకర్యం, దర్శనాల వద్ద క్యూలైన్ లలో ఇబ్బందులకు గురౌతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం టోల్గేట్ వద్దకు రాగానే వాహన దారులు ఎటు వెళ్ళాలో తెలియక సూచిక బోర్డులు కానరాక వలయ రహాదారి గుండా తిరుగుతూ చివరగా ఆర్.టి.సి బస్టాండుకు చేరుకొని అటునుండి ఎటు వెళ్ళాలో తెలియక పార్కింగ్ స్థలాలు తెలియక గత్యంత్రం లేకా రోడ్డుకు ఇరువైపులా వహనాలను నిలుపుదల చేస్తున్నారు. దీనివలన సామాన్య భక్తులు,వాహన దారులు, ఆర్.టి.సి డ్రైవర్ లు, పాదచారులు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. కావున తమరు భక్తులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టోల్గేట్ వద్దనే వాహన దారులకు నిర్దిష్ట పార్కింగ్ స్థలములను టోల్ టికెట్ లోనే నిర్ధారించి వారికితగిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయగలరు. అలాగే ప్రధాన రహదారులలో ఉన్నటువంటి గేట్లవద్ద సెక్యురిటి సిబ్బందిని నియమించి వాహన దారులకు పార్కింగ్ స్థలాలను, ప్రధాన రహదారులకు ఇరువైపులా వాహనాలు నిలుపరాదని భక్తులకు తెలియపర్చగలరని హెచ్.ఆర్.సి.ఎం.ఓ వారు కోరారు.
-నియంత్రణ లోపించిన క్యూలైన్లు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు ప్రవేశ ద్వారంవద్ద టికెట్ స్కాన్ చేయించుకొని దర్శనానికి వెళ్ళే క్రమం లోనే సిబ్బంధి పలు మార్లు భక్తులను ఆపి టికెట్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. ఒకసారి స్కాన్ చేసిన తర్వాత పలుమార్లు టికెట్ ను పరిసిలించాల్సిన అవసరరం ఏమిటని భక్తులు వాపోతున్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలనుండి ఆలయ ప్రాంగణంలో ప్రశాంతత పొందేందుకు వచ్చిన భక్తులు శ్రీశైల క్షేత్రానికి రాగానే ఆలయ ప్రాంగణంలో ఎటుచూసినా ఆలయ శిల్ప సౌందర్యాలను వీక్షించకుండా కంచెలు, ఇనుపరేకులు మరియు ఇరుకిరుకు క్యులైన్లు, అపరిశుభ్రమైన వాతావరణం తో కుడిన పరిసరాలను చూసి విస్తు పోతున్నారు. కావున శ్రీశైలం వచ్చిన భక్తులు ఆలయ కోటగోడల అందాలు వీక్షించేలా మరియు ఆలయ ప్రదక్షణలు చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని. అలాగే భక్తులకు కావలసిన సౌకర్యాల అనుగుణంగా కాంప్లెక్స్ (అన్ని వసతులతో కూడినవి) నిర్మాణం జరగాలి ఆలయం చుట్టూ మాడవీధులు, మాడవీధులు ఆనుకొని పచ్చదనం ఆహ్లాదకరంగా ఉండేలా అక్కడ ఉన్న రుద్రాక్ష వృక్షాలు కాపాడుతూ వాటికి అవతల వీధిలో క్యూ లైన్స్ నిర్మాణం జరిగేల చర్యలు తీసుకోవాలని. అలాగే ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా ఒక్కో అధికారి వచిన్నపుడు ఒక్కో విధంగా క్యూ లైన్ లు మార్పులు చేర్పులు చేపట్టి తాత్కాలికంగా నిర్మాణాలు చేసి దేవస్థానం సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు, కానీ శాశ్వత ప్రాతిపదికన క్యూ లైన్స్ నిర్మించాలని హెచ్.ఆర్.సి.ఎం.ఓ వారు కోరారు.
–విశ్రమించే వసతి లేక భక్తుల ఇబ్బందులు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్ధం వచ్చిన సామాన్య భక్తులు తగినవసతి దొరకక పార్కులలో, ఫుట్పాతులమీద మరియు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ విశ్రమిస్తున్నారు. ముఖ్యంగా వారాంతపు సెలవులలో,పర్వధినాలలో ఇటువంటి దృశ్యాలు చాలా దర్శనమిస్తుంటాయి. ఇలాంటి వారికొరకు ప్రదాన ఆలయం ముందు బాగంలో రోడ్డుకు ఇరువైపులా భక్తులు సేద తీరెందుకు షెడ్లను ఏర్పాటు చేయవలసిందిగా హెచ్.ఆర్.సి.ఎం.ఓ వారు కోరటంఅయినది.
-అభివృధి పనులలో పర్యవేక్షణ లోపం.
శ్రీశైల దేవస్థానం అభివృద్ధిలో భాగంగా పలుచోట్ల సిసి రోడ్లను ఏర్పాటు చేయుచున్నారు. ఈ సిసి రోడ్ల నిర్మాణ పనులలో బాగంగా వాటికి సంబంధించిన మేటిరియల్ కంకర,ఇసుక,సిమెంట్,ఇతరత వాటిని ప్రదాన రహదారులలో వుంచి అక్కడినుండి రోడ్లు నిర్మాణమునకు తరలించే క్రమంలో రహదారులవెంట చిందరవందరగా పడుతూ వున్నాయి. వీటి వలన భక్తులు,స్థానిక పుర ప్రజలు,వాహన దారులు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. కావున వీటి పై పూర్తీ విచారణ జరిపి బాద్యులగు సంబంధిత కాంట్రాక్టర్ లపై చర్యలు తీసుకొనవలేనని కోరారు.
-గో మాత పేరున అక్రమ వ్యాపారం.
శ్రీశైల దేవస్థానం పరిధిలో గో ఉత్పత్తులకు సంబంధించి దేవస్థానం సర్క్యులర్ ప్రకారం టెండరు దారుడు దేవస్థానం గోశాలయందు గోమయము, గో పంచకము, ఆవు పాలు మరియు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయంలో స్వామి అమ్మవార్లకు పూజలో ఉపయోగించిన వివిధ రకాల పుష్పములను వినియోగించి, ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో దేవస్థానం వారు కల్పించిన ప్రాంతములో (శ్రీశైలంలో) కొన్ని ఉత్పత్తులను తయారుచేసి శ్రీశైల దేవస్థానం పరిధిలో విక్రయించుటకు అర్హులు. కానీ ప్రస్తుతం వున్న ద్వారకాతిరుమల అగర్బత్తి మానుఫ్యాక్షర్స్ శ్రీశైలం నందు ఎలాంటి గో ఉత్పత్తులు తయారు చేయకుండా బయటి ప్రాంతం నుండి లారిల ద్వారా అగబత్తులు, దూప్ స్టిక్స్ ఎగుమతి చేస్తున్నారు, ఈ విషయమై టెండరుదారున్ని ప్రశ్నించగా మేము బయట నుండి తెచ్చుకుని అమ్ముకొనుటకు దేవస్థానం అన్నిరకాల అనుమతులు ఇచ్చిందని చెబుతున్నారు.మేము మీకు తెలియజేయు ముఖ్యవిషయం ఏమనగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్ధం శ్రీశైలం వచ్చు భక్తులు శ్రీశైల దేవస్థానం గోశాలయందు గోవుల నుండి వచ్చే గోమయం, గో పంచకము, ఆవు పాలు మరియు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయం నుండి పూల దండలు మరియు స్వామి అమ్మవార్లకు పూజలో ఉపయోగించిన వివిధరకాల పుష్పములను వినియోగించి, ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ పద్దతిలో తయారైన గో ఉత్పత్తులను విక్రయిస్తారు. కానీ ద్వారకాతిరుమల అగర్భతి మానుఫ్యాకర్స్ (రుద్రాక్ష, పారుజాతం,లిల్లి, సంపంగి దేవగన్నేరు, చంప్ప) “ఇలాంట్టి పూలు మరియు రుద్రాక్షలు శ్రీశైలంలో దొరకవు” శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సమర్పించరు. మరి ఎలా శ్రీశైలం లోగో పెట్టుకుని శ్రీశైల దేవస్థానం పేరుతొ బయటిప్రాంతం నుండి ఎగుమతి చేసిన వాటిని శ్రీశైలం లేబుల్ తో విక్రయించి ఉపయోగించటం వలన భక్తులకు శ్రీశైల దేవస్థానంమీద చాల వరకు నమ్మకం కోల్పోతారు, అలాగే శ్రీశైలక్షేత్రానికి చాలా అపకీర్తి వాటిల్లే అవకాశం వుంది, స్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద వున్న గో ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఒకటి భక్తులకు చాల ఇబ్బందిఖరంగా వుంది వారికి ఇచ్చిన స్థలము కేటాయింపు కంటే ఎక్కువ స్థలమును ఏర్పాటు చేసుకున్నారని కావున ఈ ద్వారకాతిరుమల అగర్భతి మానుఫ్యాక్షర్స్ వారిపై పూర్తి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని.ఈ ద్వారకాతిరుమల అగర్భతి మానుఫ్యాకర్స్ వారిపై గతములో పలు పుణ్యక్షేత్రాలు (ద్వారకతిరుమల మరియు సింహాచలం) లాంటి క్షేత్రాలలో నాణ్యత లేని కెమికల్ మిళిత ఉత్పతులను గో ఉత్పత్తులుగా చెప్పి దేవుని పేరుతో విక్రయించారు. దానివలన అతనిపై చాలావరకు పత్రిక మాధ్యమాలలో వార్తలు రావడంతో సంబంధించిన క్షేత్ర అధికారులకు సంబంధం వుందని పత్రిక మాధ్యమాలలో ప్రచురించారని, అదేతరహాలో శ్రీశైల క్షేత్రంలో దేవస్థానం అధికారుల చేతివాటం వుందని భక్తులు అపోహపడే అవకాశం వుంది కావున ద్వారకాతిరుమల అగర్భతి మానుఫ్యాకర్స్ వారిపై పూర్తి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గతములో శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్ గుప్త గోశాలను పర్యవేక్షించి విభూది తయారికేంద్రంలో విభుధిలో (కోబ్రా) అను కెమికల్ (సెంట్) ను ఉపయోగిస్తున్నారని తెలుసుకొని దానివలన భక్తులకు చర్మవ్యాధులు మరియు అనేకరకాల వ్యాధులకు కారనమౌతుందని తెలుకుని వెంటనే విభూది తయారికేంద్రంలో విభుధిలో కోబ్రా అను కెమికల్ (సెంట్) ను ఉపయోగించడం ఆపివేయడం జరిగింది. కావున తమరు భక్తుల సౌకర్యార్ధం మరియు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు మరియు శ్రీశైల క్షేత్రానికి అపకీర్తి రాకుండా తగిన చర్యలు తీసుకోనవలసిందిగా హెచ్.ఆర్.సి.ఎం.ఓ వారు కోరడమైనది.
-అదుపు లేని అక్రమ నిర్మాణాలు,విచ్చలవిడిగా భావన నిర్మాణ ముడి సరుకు విక్రయాలు.
శ్రీశైల దేవస్థానం పరిధిలో గల ఆలయ భూములలో అక్రమనిర్మానములు, అత్యదిక కరెంటు మీటర్లు కేటాయిస్తున్నారు.శ్రీశైలానికి జీవనోపాది నిమిత్తం వచ్చిన వారి సంఖ్య నానాటికి అధికమైతుంది వీరు దేవస్థానం స్థలాలలో రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. 2008 లో ప్రభుత్వం ఒక సర్వే చేయగా 1069 గృహాలు ఉన్నాయని తెలిసింది. 2018 లో నారాయణ భరత్ గుప్త ఐ.ఎ.ఎస్ శ్రీశైలంలో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అని సర్వే చేయగా 2526 ఇల్లు ఉన్నట్లు నివేధిక వచ్చింది. అంటే 10 సం||రాల లో దాదాపు 1500 ఇల్లు నిర్మాణం అయ్యాయి వీరందరికీ కూడా రోడ్లు వసతి, మురుగునీరు, త్రాగునీరు వసతి,దేవస్థానం చూడవలసి వస్తున్నది. ఇవ్వన్ని కూడా దేవస్థానంపై అదనపు భారం పడుతుంది. పైగా ప్రతి ఒక్క రాజకీయనాయకుడు అధికారంలో ఉన్నవారు దేవస్థానం నిధులు ఓట్ల కోసం ఖర్చు పెట్టిస్తున్నారు. ప్రభుత్వం నుండి ఏ ఒక ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా దేవస్థానానికి తేలేదు రాజకీయ నాయకుల జోక్యం వల్ల దేవస్థానం నిధులు ప్రైవేటు పనులకు ఖర్చు పెట్టవలసి వస్తుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 2005 ప్రకారం ఇక్కడ వున్న స్థలం మొత్తం 4800 ఎకరాల మేరకు శ్రీశైల దేవస్థానం సంబంధించిన భూమి అన్యాక్రాంతం కాకుండా 2019 లో నారాయణ భరత్ గుప్త ఐ.ఎ.ఎస్ ఒక జీవో ఏర్పాటు చేసియున్నారు. అంతే కాకుండా శ్రీశైల దేవస్థానం పరిధిలో ఎలాంటి నివాసాలు వుండకుండా శ్రీశైల దేవస్థానం అభివృధికై ఆంద్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ నుండి శ్రీశైలంలో నివసిస్తున్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయం చుట్టుపక్కల వున్న గృహములకు మరియు కొత్తపేటలో ఉన్నటువంటి రెవిన్యు స్థలములలో వున్న గృహములకు, ఆలయ అధికారులకు, ఆలయ సిబ్బందికి సుండిపెంట గ్రామంలోని నీటి పారుదల శాఖకు సంబంధించిన భూములలో దేవస్థానం కోటర్స్ మరియు స్థానికులకు సెంటునర స్థలమును కేటాయించియున్నారు. కాని ఇక్కడవారు అక్కడికి వెళ్ళడం కాని అక్కడి స్థలాలు వెనక్కు ఇవ్వడం కానీ చేయలేదు. పైగా శ్రీశైలం లోనే ఎస్.టి, ఎస్.సి కాలనీకి వెనుకవైపు భాగంలో స్థలాలు మంజూరు చేసియున్నారు. ఒక వేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ఆలయం వెనకభాగాన వున్న గృహములను తరలించడంలో ఆలయం వెనుకబాగాన 57 కరంటు మీటర్స్ మాత్రమె వున్నాయని స్థానిక ఎ పి ఎస్ పి డి సి ఎల్ వారు తెలిపారు. మరి ఎన్నడూ లేనివిధంగా 2023 లో మాత్రమె శ్రీశైలంలో 750 మందికి పైగా కరెంటు మీటర్లు కావాలని అర్జీలు పెట్టుకున్నారు. శ్రీశైల దేవస్థానం లో ఎలాంటి నివాసాలు ఉండకుండా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో స్థానిక నివాసాలను తరలించాలని 2019 లో సుండిపెంట గ్రామంలో స్థలాలు కేటాయించియున్నారు. 2023 నాటికి శ్రీశైలం లోనే మాకు ఇల్లు వున్నాయి. కరెంటు మీటర్స్ లేవు అని 750 మంది అర్జీలు పెట్టుకున్నారు. మరి ఈ 750 మందికి ఇళ్లస్థలాలు ఎవరిచ్చారు వారు ఇల్లు నిర్మించుకుంటుంటే దేవస్థానం అధికారులు ఎంచేస్తున్నారు. ఒకవేళ వారందరూ ఇక్కడే వున్నవారైతే వారికి కరెంటు మీటర్స్ ఉండాలి లేదంటే మరి వీరందరికీ స్థలాలు ఎలావచ్చాయి ఎవరి అనుమతితో వీరందరూ గృహములు నిర్మించుకున్నారు. అలాగే శ్రీశైలం ఆలయ ఆగమ శాశ్రాల ప్రకారం ఆలయ శిఖరమును మించి ఎటు వంటి గృహములు,సత్ర సముదాయములు నిర్మించ కూడదు అలాగే ఆలయ వెనుక బాగంలో వున్న ప్రభుత్వ రెవిన్యు స్థలములో కూడా జి+1 మాత్రమె కట్టవలేనని వారికి ఇచ్చినటువంటి పట్టాలో వుంది కాని ఇక్కడ ఎవరికీ తోచిన విదముగా వారు ఇష్టానుసారం ఆలయ శిఖరానికి మించి భహుల అంతస్తులు నిర్మించియున్నారు. దేవస్థానం అధికారులు చాల వరకు అక్రమగా నిర్మించియున్న భవంతులను పడదోసి ప్రస్తుతం నిర్మిస్తున్న వాటిని నిలుపుదల చేస్తున్నారు. ఈ నిర్మాణాలకు కావలసిన (ముడిసరుకు) కంకర,ఇసుక,ఇటుక,స్టీల్.సిమెంట్టు ఇతరత్ర సామాగ్రి స్థానికంగా గుత్తేదారులు ఈ నిర్మాణ దారులకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై,కంకర,ఇసుక,ఇటుక,స్టీల్.సిమెంట్టు విక్రయిస్తున్న గుత్తేదారులపై, సంబంధిత అధికారులపై తగిన విచారణ జరిపి ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తిసుకోవాలని కోరారు.
విజ్ఞప్తి. మానవహక్కుల కౌన్శిల్ మరియు మీడియా ఆర్ఘనైజేషణ్ {హెచ్.ఆర్.సి.ఎం.ఓ} తరపున శ్రీశైల క్షేత్రానికి వచ్చిన భక్తులను విచారించి వారు తెలిపిన సమాచారాన్ని మరియు స్థానికంగా వుండే సమస్యలను, క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఒక భాధ్యత గల సంస్థగా తమరి ద్రుష్టికి తీసుకు రావటం మా భాధ్యతగా మేము భావిస్తున్నాము. కావున భక్తుల ఆకాంక్షలను త్వరిత గతిన నేరవేర్చగలరని దేవస్థానం కార్యనిర్వహణాధికారిని హెచ్.ఆర్.సి.ఎం.ఓ వారు కోరడం జరిగింది.