గోవింద రెడ్డీ నీ భజన మానుకో … నిజం తెలుసుకో…. మచ్చ లేని మహానాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి పై దురుసు వ్యాఖ్యలు చేస్తే … చూస్తూ ఊరుకోము…. ఖబడ్దార్..
స్థాయికిమించి … స్థానం మరచి,ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి పై అవాకులు చెవాకులు పేల్చిన లాయర్ గోవిందరెడ్డిపై ప్రజాప్రతినిధులు,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు YCP పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆత్మకూరు ఎంపిపి నల్లకాల్వ తిరుపాలమ్మ మాట్లాడుతూ… ఎస్సి మహిళనైన తనను జనరల్ సీటు గా ఉన్న ఆత్మకూరు మండల పీఠం పై కూర్చోబెట్టి న ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి సామాజిక దృక్పతాన్నీ తూచా తప్పక పాటించారు.అంతటి ఉదాత్తుడి పై చవకబారు ఆరోపణలు చేయడం సరైందికాదన్నారు. సాధారణ నిరుపేద కుటుంబానికి చెందిన తాను ఎంపిపి పదవి కోసం డబ్బులు సమకూర్చ గలగడం సాధ్యమేనా? …ఇలాంటి చవకబారు ఆరోపణలు చేయడం న్యాయవాది అయిన గోవిందరెడ్డికి తగదని తిరుపాలమ్మ హితవు పలికారు……
పార్టీ నాయకులు పువ్వాడి భాస్కర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ ,జెడ్పిటిసి టికెట్ ల కోసం డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణ దారుణమైనదన్నారు.నామమాత్రపు పోటీ కూడా లేని ఆ ఎన్నికలలో డబ్బు ప్రసక్తి ఎక్కడ ఉందన్నారు.అడిగిన ఆర్థులకీ కోట్లాది రూపాయలు తృణప్రాయంగా ఖర్చు పెట్టె ఎమ్మెల్యేకు ఆ అవసరమేమని ప్రశ్నించారు.చక్రపాణి రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని అతి దగ్గరగా చూసిన అనుభవమున్న గోవింద రెడ్డి కలుండి చూడలేని కబోదిలా అర్తం పర్తం లేని ఆరోపణలు చేశాడన్నారు.
శిల్పా చక్రపాణి రెడ్డికి ఇచ్చే సుగుణమే కానీ తీసుకునే దుర్గుణం లేదని తెలియదా అని ప్రశ్నించారు.పార్టీ పరంగా నే కాని వ్యక్తిగతంగా ఏనాడు విమర్శించని ఉన్నత వ్యక్తిత్వం గల శిల్పా పై దిగజారి మాట్లాడడం గోవిందరెడ్డికి తగదని పార్టీ నాయకుడు జయకృష్ణ అన్నారు.
కౌన్సిలర్ పాణ్యం పార్వతి మాట్లాడుతూ అధికారులు,పొదుపు మహిళలు తప్ప ఎమ్మెల్యే వెంట ప్రజాలేవరు లేరన్న విమర్శను తిప్పి కొడుతూ శిల్పా ప్రజాభిమానం వెల్లువెత్తుతుంటే అది కనిపించకపోవడం అన్నది గోవిందరెడ్డి జ్ఞానాంధకారాన్ని సూచిస్తుందన్నారు.పొదుపు మహిళకు వచ్చిన రాయితీలను అడ్డుకున్న చరిత్ర నాటి పాలకులదైతే సొంత సొమ్ము వడ్డీలేని ఋణంగా ఇచ్చిన ఘనత శిల్పా చక్రపాణి రెడ్డిదని అన్నారు………
షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజాద్ అలీ మాట్లాడుతూ అభి వృద్ధి గురించి బహిరంగ చర్చ చేద్దామనే అడ్వొకేట్ గోవిందరెడ్డి గారు మీకు చూసే మనసుంటే నిలుచున్న చోటు నుంచే అడుగు కదపకుండా తలతిప్పి చూడండి శిల్పా అన్న చేస్తున్న అభివృద్ధి కనిపిస్తుంది అన్నారు.గ్రామ,గ్రామాన తయారైన సచివాలయ కాంప్లెక్స్ లు,సిసి రోడ్లు అభివృద్ధి కాదా అన్నారు.ముస్లిం మైనారిటీల స్మశాన వాటికలో సిసి రోడ్డు,వెలుగోడు రొఖియాబీ దర్గా,జామియ మసీదు, ఈద్ గా,షాది కానా ల అభివృద్ధి కోసం 3 కోట్ల రూపాయలు విడుదల చేయించడంలో శిల్పా చక్రపాణి రెడ్డి అభివృద్ధి దృక్పతం మీకు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. మీ నాయకుడు పుణ్య మాల ధారణలో ఉండి కూడా బూతులు మాట్లాడే ఒరవడికి శ్రీకారం చుడితే మీరు ఈ రకంగా తప్పుడు మాటల తూటాలు పేల్చుతూ నాయకుడి అడుగు జాడల్లో నడుస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిలర్లు విజయ్ కుమార్ , సుల్తాన్, యూనస్, ప్రకాష్, రంగస్వామి,రహిమాన్, నాయకులు సయ్యద్ మీర్, బాలస్వామి,గౌస్ ఆజం, రఫిక్, భాష తదితరులు