రాజ్యాంగమే దేశానికి మార్గనిర్దేశం: కదిరికోట ఆదెన్న
— లౌకిక,సామ్యవాద పదాలను తొలగించాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం హర్షనీయం.
— రాష్ట్రంలో డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు కొనసాగింపు చంద్రబాబు తోనే సాధ్యం!
— కదిరికోట ఆదెన్న ఆధ్వర్యంలో… ఘనంగా 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
తేది:26-11-2024, ఎమ్మిగనూరు.
మన రాజ్యాంగం భారతదేశానికి సర్వసత్తాక, సామ్యవాద,లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వంటి విశిష్ట లక్షణాలు అందించి దిక్సూచిగా మారిందని, భారతదేశ దశా,దిశను నిర్దేశించిన ఘనత భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి దక్కిందని టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న పేర్కొన్నారు. మంగళవారం టిడిపి నాయకులు”కదిరికోట ఆదెన్న”ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా మండల తహసిల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రదర్శన చేపట్టి పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ గారి నిలువెత్తు కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారత రాజ్యాంగం ఏర్పాటుకు 389 మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్త్ ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. రాజ్యాంగ రచన ప్రక్రియ కోసం 7గురు సభ్యులతో డా.బి.ఆర్. అంబేద్కర్ ను చైర్మన్ గా డ్రాఫ్టింగ్ కమిటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ 2 సంవత్సరముల 11 నెలలు, 18 రోజులు అహర్నిశ లు శ్రమించి రాజ్యాంగ రచన ప్రక్రియను పూర్తి చేసిందన్నారు.1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొంది 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవం వేళ రాజ్యాంగం లోని లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేయడం రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవమన్నారు.
అంబేద్కర్ ఆశయాలు కొనసాగింపు చంద్రబాబు తోనే సాధ్యం ఇకపోతే రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగింపు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు గారి తోనే సాధ్యమని టిడిపి నాయకులు “కదిరికోట ఆదెన్న” తెలిపారు. ప్రజాస్వామిక బద్ధంగా పరిపాలన కొనసాగిస్తూ చంద్రన్న పాలన అంటే చల్లని పాలనగా నిరూపించాడన్నారు. 2024 బడ్జెట్ ను సామాజిక న్యాయం పాటిస్తూ… అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ… రూ.2,94,427 కోట్లు బడ్జెట్ ను రూపొందించి ఇందులో ఎన్నడు లేని విధంగా ఎస్సీల సంక్షేమానికి రూ.18,497 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.7,557 కోట్లు నిధులు కేటాయించి దళిత,గిరిజనుల బాంధవుడుగా, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే నాయకుడిగా నిలిచారన్నారు.
రాజ్యాంగం పట్ల చంద్రబాబు
నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా ప్రతి పాఠశాలలో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం, రాజ్యాంగం పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న గౌరవం స్పష్టంగా అర్థమైందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదివి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోజా ఆర్ట్స్ ఉసేని, సప్లయర్స్ బంగారప్ప, ఎరుకల చరణ్, యస్.సాల్మన్, జాలవాడి ఏసన్న, జగతాప్ జై పాల్, పందికోన సురేష్, వన్నెల మోష,కదిరికోట ప్రభుదాసు, సంధ్య పోగు రామన్న, బొగ్గుల మహేష్, హనుమంతు, సాగర్,చిన్న, సూరిపోగు మధు తదితరులు పాల్గొన్నారు.
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్