జర్నలిస్టులు పిల్లలకు 50 శాతం రాయితీ – కలెక్టర్ రంజిత్ బాషా కు కృతజ్ఞతలు

50 percent discount for children of journalists

50 percent discount for children of journalists

జర్నలిస్టులు పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించడం హర్షణీయం

కలెక్టర్ రంజిత్ బాషా కు కృతజ్ఞతలు

డీఈఓ కు ధన్యవాదాలు

కలెక్టర్ , డిఈఓ లను సన్మానించిన ఏపీయుడబ్లుజే నాయకులు

కర్నూలు/ ఎమ్మిగనూరు,(డిసెంబర్ 18) కర్నూలు జిల్లాలో అక్రీడియేషన్ కలిగిన
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్, ఎయిడెడ్ స్కూల్స్లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ను, డీఈవో శామ్యూల్ ఫాల్ ను కలసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా జిల్లాలో ఇంటి స్థలాలు లేని జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు త్వరగా ఇచ్చే విధంగా చూడాలని కోరడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఇస్తామని సానుకూలంగా చెప్పడం జరిగింది. కలెక్టర్, డీఈఓ ను కలిసిన వారిలో ఐజేయూ జాతీయ సమితి సభ్యులు జి కొండప్ప, కే నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈఎన్ రాజు, కే శ్రీనివాస్ గౌడ్, ఆంధ్ర జ్యోతి డెస్క్ ఇన్చార్జి నవీన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా నాయకులు మధుసూదన్ గౌడ్, హుస్సేన్, జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి, సహాయ కార్యదర్శి అవినాష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిరంజీవి, మధు, సబ్ ఎడిటర్స్ మనోహర్, తుంబల్, జిల్లా నాయకులు, మంజునాథ్ యాదవ్, నాగప్రసాద్ యాదవ్, మల్లికార్జున, లక్ష్మన్న, రంగా, గంగాధర్, ఓర్వకల్లు ఇంతియాజ్, వీడియో జర్నలిస్టు సూరి, చంద్ర శేఖర్, ఫోటో జర్నలిస్టు రఫీ, శీను తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మిగనూరు తాలూకా అద్యక్షుడు బీ శ్రీనివాస నాయుడు,తాలూకా ప్రధాన కార్యదర్శి సి నాగరాజు,పట్టణ అధ్యక్షుడు జిబి పరమేశ్వర , జిల్లా ఉపాధ్యక్షుడు జాలవాడి బాషా, జిల్లా సహాయ కార్యదర్శి నూర్ అహ్మద్, తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ వీ రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం ఈరన్న ,తాలూకా కోశాధికారి అశోక్ లు కలెక్టర్ రంజిత్ బాషా, డి ఈ ఓ శ్యాముల్ పాల్ కు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top