వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తాజాగా క్లారిటీ వచ్చింది. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్ళనున్న వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతుంది.
గత కొన్ని రోజులుగా…. వైయస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం నాన్చుతూ వచ్చింది. అయితే ఇది గమనించిన వైయస్ షర్మిల కీలక స్టేట్మెంట్ ఇచ్చింది.
సెప్టెంబర్ నెల ముగిసేలోపు విలీనంపై కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి తేల్చాలని… లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తానని షర్మిల ప్రకటించింది. అయితే షర్మిల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో కాస్త కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రేపు లేదా ఎల్లుండి షర్మిల ఢిల్లీకి వెళ్ళనున్నట్లు సమాచారం. షర్మిలకు రెండు బంపర్ ఆఫర్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఖమ్మం లోక్ సభ సీటుతో పాటు, ప్రియాంక గాంధీతో సమానంగా AICC జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయిందట. అయితే.. పాలేరు సీట్ ఆశించిన షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చిందని సమాచారం. పాలేరు టికెట్ మాత్రం ఇవ్వబోమని అధిష్టానం పేర్కొందట.
#yssharmila #ysrtp #sharmila #telangana #palitics