ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి | Happy YSR Jayanti
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆత్మకూరు మండలం నల్లకాల్వ సమీపంలో ఉన్న వైయస్సార్ స్మృతి వనంలో.. జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి కార్యకర్తలు , నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని దివంగత నేతకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శిల్పా భువనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ..ఒక డాక్టర్ గా పులివెందుల ప్రజలకు సేవలు అందిస్తూ..
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని కొనియాడారు..
ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల్లో బ్రతికే ఉన్నాయని అన్నారు..
అలాంటి మహనీయుడిని గుర్తు చేసుకుంటూ.. ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.. Best Pendriw
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం సంతోషదగ్గ విషయమని వారి గెలుపును స్వాగతిస్తున్నామని అన్నారు..
కానీ గెలిచిన టిడిపి నాయకులు అభివృద్ధిపై దృష్టి సాధించకుండా వైసిపి నేతలపై దాడులు చేయడం మంచిది కాదని అన్నారు.
అలాగే చంద్రబాబు నాయుడు అలివి గాని హామీలు ఇచ్చి ప్రజలను మరొకసారి మోసం చేశారని .. 2029లో మళ్లీ వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అలాగే శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా చక్రపాణి రెడ్డి.. మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
AlsoRead నల్లమలకు అడవి దున్న – Adavi Dunna
మహానేత గురించి మరిన్ని విషయాలు
నేడు దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ వెంట వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారు. జగన్‌తో పాటు మేనత్త విమలమ్మ, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు
మరోవైపు వైఎస్సార్ జయంతి సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు. ‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టిన రోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం.జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి’ అన్నారు.
మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. రాస్ట్రంలో పండుగ వాతావరణం నెలకొనింది.