ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ.. ys జగన్ ఇంటిపై పులివెందుల YCP కార్యకర్తల తిరుగుబాటు
కిటికీలు పగలకొట్టిన సొంత క్యాడర్ నాయకులు
AP : పులివెందులలో జగన్ ఇంటిపై దాడి చేశారంటూ.. తెలుగుదేశం పార్టీ ఆఫీషి యల్ సైట్ ..ట్విట్టర్ X లో పోస్ట్ చేసింది..
జగన్ ఫ్యూడల్ మనస్తత్వంపై తిరగబడిన పులివెందుల వైసీపీ కార్యకర్తలు. పులివెందులలో జగన్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్ళి, జగన్‌కు వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు. అధికారంలో ఉండగా తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమై, ఇప్పుడు పులివెందులలో మేము గుర్తుకు వచ్చామా అంటూ, వైసీపీ కార్యకర్తల ఆగ్రహం. జగన్ ఇంటి అద్దాలు ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు. సొంత కార్యకర్తలే ఎదురు తిరగడంతో అవాక్కయిన జగన్.
అంటూ.. టిడిపి చెందిన X లో పోస్టు చేయడంతో.. రాష్ట్రంలోని వైసిపి కార్యకర్తలు అవాక్కయ్యారు. జగన్ ఇంటిపై దాడి చేశారా.. అంటూ పుణరాలోచనలో వైసిపి క్యాడర్ పడింది.. ఇంతకీ జగన్ గత ఐదేళ్ల పాలనలో పులివెందుల ప్రజలకు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనప్పటికీ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక కార్యకర్తలను , తన క్యాడర్ ను.. కానీ పట్టించుకో.. లేదన్న మాట మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నోట వినిపిస్తున్న మాట… జగన్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ముందుకు పోతాడా.. అన్నది వేచి చూడాలి.