వైయస్ జగన్ – ఫర్నిచర్

ys-jagan-mohan-reddy-1.jpg

నిస్సిగ్గుగా, నీతిమాలిన రాజకీయం చేస్తున్న Telugu Desam Party (TDP) తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని .. లేళ్ల అప్పిరెడ్డి , వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అన్నారు.

మంచి సేవలు అందించే అవకాశాన్ని కూటమికి ప్రజలు అప్పగిస్తే, అధికారం చేపట్టాక వారి ప్రవర్తన, వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకీ దిగజారుతోంది. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డం ఒక అలవాటుగా టీడీపీ మార్చుకుంది.

ముఖ్యమంత్రి హోదాలో శ్రీ వైయస్ జగన్ గారి క్యాంపు కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా.. వారి క్యాంపు కార్యాలయాలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయం. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగింది.

వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా శ్రీ వైయస్ జగన్ గారిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయి. తప్పుడు ప్రచారాలతో శ్రీ వైయస్ జగన్ ‌గారి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయలేరని తెలియజేసుకుంటున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top