వైసీపీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు

YCPcouncilors and leaders joined TDP

YCPcouncilors and leaders joined TDP

  • ఎమ్మిగనూరులో వైసీపీ కోలుకోలేని దెబ్బ
  • వైసీపీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు
  • వైసీపీ ప్రభుత్వంలో అభివృద్దికి నోచుకోని వైనం
  • అభివృద్ధి అజండాతో టీడీపీ చేరికలు
  • పార్టీలో తగినంత గుర్తింపు లేకనే టిడిపిలో చెరికలు
  • ఎమ్మెల్యే బీవీ సమక్షంలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు

ఎమ్మిగనూరు పట్టణంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. కౌన్సిలర్లు , నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపి గూటికి చేరారు . వారికి ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా తెలుగు దేశం పార్టీ లోకి ఆహ్వానించారు.

కూటమి అంటే అభివృద్ధి.. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు తోనే సాధ్య మవుతుందని దీనికి ఆకర్షితులై ఈరోజు వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలోకి చేరుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు అన్నారు. ఎమ్మిగనూరు మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్లు సరోజ, వహిద్, స్వాతి, వైసీపీ మరియు సోషల్ మీడియా నాయకులు మన్సుర్ బాషా, జహీర్, వినయ్ లతో మాజీ కౌన్సిలర్ వహబ్ పాటు తదితరులు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి కౌన్సిలర్లు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. గత ఐదేళ్ల నుండి టిడిపి పార్టీ కోసం కష్టపడిన నాయకులు కార్యకర్తలు ఉన్నారని, వారికి పార్టీ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని, అదేవిధంగా పార్టీలో మోసం చేయాలని మోసపూరిత డ్రామాలు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపారు.

నాపై నమ్మకంతో వైసీపీని విడి టిడిపిలో చేరిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూసుకుంటానని తమ నాయకులతో పాటు వీరందరికి సమన్యాయం చేస్తానని అన్నారు

Also Read తుంగ (గడ్డలు) ముస్తలతో శరీర దుర్వాసన మాయం

వైసీపీలో కౌన్సిలర్లు వారి వారి వార్డులో ఒక వైపు కూడా వేసుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. కనీసం ఒక వ్యక్తికి సహాయం చేసిన పాపనా పోలేదన్నారు. ఆఖరికి స్థానిక సంస్థల నిధులు కూడా మాజీ సీఎం జగన్ గందరగోళ పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీకి కష్టపడిన నిజాయితీ కార్యకర్తలకు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఏరోజు మర్చిపోడని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అజెండాతో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలో వార్డుల్లో అభివృద్ధి చేసుకోలేక పోయారని, కౌన్సిలర్లు వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ఎమ్మెల్యే బీవీ స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారి పార్టీ అభ్యున్నతికి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విదంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

వైసీపీ ప్రభుత్వంలో వార్డులో ఎటువంటి అభివృద్ధి చేసుకోలేక పోయారన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బలో పేతానికి కృషి చేయాలని, టీడీపీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top