నాకు డబ్బులు ఇచ్చింది టీడీపి నే… ప్రమాణం చేసిన ఆరా మస్తాన్?
అంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆరా మస్తాన్ పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మే 13వ తేదీన ఏపీఅసెంబ్లీ ఎన్నికలు జరిగాక…
ఫలితాల కంటే ముందు… ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఈ సందర్భంగా చాలా సర్వే సంస్థలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలు ఇవ్వగా… ఆరా మస్తాన్ మాత్రం వైసిపి మరోసారి అధికారంలోకి రాబోతుందని… స్పష్టం చేశారు. వంద నుంచి 110 సీట్ల మధ్య వైసీపీకి సీట్లు వస్తాయని ఆ సందర్భంగా తెలిపారు ఆరా మస్తాన్.
తన సర్వేలు ఇప్పటికే చాలా నిజమయ్యాయని.. ఈసారి కూడా వైసిపి కచ్చితంగా అధికారంలోకి రాబోతుందని… కరాకండిగా తేల్చి చెప్పారు. జూన్ 4వ తేదీన ఫలితాలు రాగానే… ఆరా మస్తాన్ సర్వే రిపోర్టు అట్టర్ ప్లాప్ అయింది. కేకే సర్వే మాత్రం… చెప్పినట్లుగానే ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. వైసిపికి 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆరా మస్తాన్ ఇక్కడ కనిపించలేదు.
తాజాగా… ఆరా మస్తాన్ ఇంటర్వ్యూ సంపాదించారు జాఫర్. ఈంటర్వూ సందర్భంగా… ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆరా మస్తాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు… జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పనిచేయలేదని… ఆయనను కలవలేదని… భగవద్గీత అలాగే ఖురాన్ గ్రంథాలపై ప్రమాణం చేసి మరీ చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీకి తాను పనిచేసినట్లు ఆరా మస్తాన్ వెల్లడించారు. దానికోసం టిడిపి డబ్బులు కూడా ఇచ్చిందని ఆయన తెలిపారు.
కానీ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రమే పర్సనల్గా తనతో సర్వేలు చేయించుకున్నారని తెలిపారు. ఇక ఏపీలో.. పవన్ కళ్యాణ్ కారణంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది అని వివరించారు. తన గత సర్వేలు సక్సెస్ అయ్యాయి కానీ ఏపీలో మాత్రం… బెడ్స్ కొట్టినట్లు ఒప్పుకున్నారు. మన తెలంగాణలో కూడా సంచలనం సృష్టించినట్లు తెలిపారు. అయితే ఏపీలో తమ సర్వేలు విఫలం కావడానికి గల రిపోర్ట్ను తయారు చేస్తున్నామని… త్వరలోనే దానిపై విశ్లేషణ చేస్తామని వివరించారు ఆరా మస్తాన్. మళ్లీ ఫామ్ లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.