ఉత్తరేణి మొక్క సర్వత్రా కనిపిస్తూ, దాదాపు రెండు మీటర్ల ఎత్తువరకు పెరిగే బహు వార్షికపు మొక్క శాస్త్రీయంగా దీన్ని ‘అభిరాంథస్ అస్పెర’గా వ్యవహరిస్తారు. ఇది అమరాంతేసి కుటుంబానికి చెందిన మొక్క
దీని కాండం గుండ్రంగా ఉండి సామాన్య పత్రాలు అభిముఖ పత్ర విన్యాసంలో అమరి ఉండి గుండ్రంగా లేదా దీర్ఘ వృత్తాకారంలో ఉంటాయి.
ఉత్తరేణి మొక్కలు పొడవైన కంకులు కలిగి ఉండి, వాటి విత్తనాలు జీలకర్ర లాగా ఉంటాయి. నడిచేటప్పుడు గింజలు మన దుస్తులకు అంటుకుంటాయి.
ఉత్తరేణి మొక్కలు ప్రధానంగా ఎరుపు, తెలుపు భేదాలతో రెండు విధాలుగా ఉంటాయి. వాటి కాండం ఈనెల రంగుల్ని బట్టి ఈ భేదాలను గుర్తించవచ్చు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
ఉత్తరేణి మొక్కలో అపార ఔషధ గుణాలున్నాయి. దీని సర్వాంగాలు ఔషధానికి ఉపయోగించేవే.
ఉత్తరేణి మొక్కను సమూలంగా దంచి
తీసిన రసంలో దూదిని ముంచి ” ఆ దూదిని పిప్పి పంటిపై నొక్కి వుంచితే త్వరగా బాధ తగ్గుతుంది.
ఉత్తరేణి మొక్కని బాగా ఎండించి మెత్తగా పౌడరు చేసి ఉదయం, సాయంత్రం పావు స్పూను నుంచి అర స్పూను వరకు మజ్జిగలో కలిపి సేవిస్తే రక్త – విరేచనాలు తగ్గుతాయి.
రెండు స్పూన్ల పౌడర్ను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి – అరగ్లాసు నీరు మిగిలేలా కాచి వడగట్టి కొద్దిగా పంచదార కలిపి తీసుకంటే ఉబ్బు 7 వ్యాధులు తగ్గటంతో పాటు గర్భవతుల కాళ్ల వాపులు తగ్గుతాయి.
బాగా ఎండించిన ఉత్తరేణి మొక్కల్ని కాల్చి బూడిద చేసి అందులో కొద్దిగా .. ఆవనూనె కలిపి శోభిమచ్చలపై పూస్తుంటే అవి త్వరగా తగ్గుతాయి.
ఈ బూడిదను పావు స్పూను చొప్పున రోజూ రెండుమార్లు తేనెతో కలిపి సేవిస్తే దగ్గు, ఉబ్బసం తగ్గుతాయి. పూటకు అరస్పూను చొప్పును బియ్యం. కడుగులో కలిపి సేవిస్తే ఉబ్బు, ఉదరవ్యాధులు తగ్గుతాయి.
చెవినుంచి చీము కారుతూ చెవిపోటు, చెవినొప్పి ఉన్నప్పుడు చెవిని. బాగా శుభ్రం చేసి ఈ బూడిదను కొబ్బరి నూనెలో కలిపి రెండు మూడు చుక్కలు — చెవిలో వేసి దూది పెడితే మంచి ఫలితముంటుంది.
ఉత్తరేణి ఆకుల్ని దంచి తీసిన రసాన్ని అప్పుడే తగిలిన గాయాలపై పూస్తే రక్తస్రావం ఆగుతుంది.
కందిరీగలు, తేళ్ళు, తేనెటీగలు మొదలైనవి కుట్టినపుడు ఈ రసాన్ని ఆయా భాగాలపై పూసి, ఆకుల్ని దంచిన ముద్ద 5- 10 గ్రాములు లోనికి సేవిస్తే వాటి వల్ల కలిగే మంట, నొప్పి, దురద, వాపు తదతర బాధలు తగ్గుతాయి.
ఉత్తరేణి గింజల్ని నీటితో నూరి కుంకుడు గింజ ప్రమాణంలో బియ్యం కడిగిన నీరు అనుపానంగా తీసుకుంటే మూలవ్యాధిలో కలిగే రక్తస్రావం తగ్గి మొలలు సమసిపోతాయి.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
ఉత్తరేణి ఆకుల ఉపయోగాలు
ఉత్తరేణి వేరును నీళ్లలో గాని, గేదె పాలలో గాని వేసి కషాయం కాచి తాగితే దగ్గు తగ్గుతుందని గిరిజనుల స్వానుభవం. గిరిజనులు పిచ్చి కుక్క కరిస్తే ఉత్తరేణి గింజల్ని మాడ్చి చూర్ణించి కాటుపై చల్లి రాగిరేకు పెట్టి కట్టుకట్టి ఈ మొక్క రసాన్ని తాగిస్తారట.
పిచ్చి కుక్క కాటు వల్ల మనదేశంలో అత్యధికంగా అంటే సంవత్సరానికి 25 వేలకి పైగా మరణాలు సంభవిస్తున్నట్లు గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి.
కావున శాస్త్రవేత్తలు ఇలాంటి ఔషధాలపై సమగ్ర శాస్త్రీయ పరిశోధనలు చేసి సత్ఫలితాలు పొందగలిగితే అంటుబాటులో ఉండే సులభ చికిత్స ద్వారా మానవాళికి ఎంతో మేలు చేకూరుతుంది.
ఉత్తరేణి ఆకులు 10 గ్రా, మిరియాలు 5 గ్రా. నాలుగైదు వెల్లుల్లి రేకలు కలిపి మెత్తగా నూరి గచ్చకాయ ప్రమాణం మాత్రలు చేసి ఆరించి ఉదయం సాయంత్రం తీసుకుంటే వదలకుండా వస్తున్న మొండి జ్వరాలు తగ్గుతాయి.
ఉత్తరేణి బూడిదకు 16 భాగాల నీరు చేర్చి బాగా కలిపి కొన్ని గంటలు
అలాగే ఉంచి ఆ నీటిని వడగట్టి, నీరంతా ఇగిరిపోయేంత వరకు వేడిచేస్తే పాత్ర ” అడుగున మిగిలి ఉన్న పదార్థమే ఉత్తరేణి క్షారం. ఈ క్షారాన్ని పావు స్పూను ! నుంచి అర స్పూను వరకు రోజూ రెండుమార్లు సేవిస్తే కఫం తెగిపడి పోయి శ్వాస బాగా ఆడుతుంది.
ఎండబెట్టిన ఉత్తరేణి గింజల పొడి వంద గ్రాములు, పొంగించిన పటిక పది గ్రాములు, ఉప్పు పది గ్రాములు, ఒకట్రెండు వుంట కర్పూరం బిళ్ళల పొడి కలిపి వుంచుకుని..
నిత్యం దంత ధావన చూర్ణంగా వుపయోగిస్తుంటే చిగుళ్ళ నుంచి రక్తస్రావం, పంటి సలుపులు, పంటి నొప్పులు, చిగుళ్ళ వాపు,
పోటు వంటి సమస్యలు తగ్గి దంతాలు ధృడంగా మెరుస్తూ కాంతులీనుతూ ఆరోగ్యంగా ఆకర్షణీయంగా వుంటాయి.
ఎండించిన ఉత్తరేణి మొక్క మెత్తటి చూర్ణాన్ని పావు స్పూను నుంచి అర స్పూను వరకు రోజు రెండు పూటలా కప్పు మజ్జిగలో కలిపి సేవిస్తుంటే రక్త విరేచనాలు,
ఆవు నెయ్యితో కలిపి సేవిస్తుంటే పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంధి వాపు తగ్గుతుంది.
ఉత్తరేణి వేళ్ల చూర్ణం, మిరియాల చూర్ణం సమానంగా కలిపి నీటితో నూరి సెనగలంత మాత్రలు చేసి నీడలో ఎండించి ఉదయం,
సాయంత్రం రెండు మాత్రల చొప్పున సేవిస్తుంటే వివిధ రకాల చర్మ రుగ్మతల్లో సుగుణం కనిపిస్తుంది.
ఉత్తరేణి రసం, నువ్వులనూనె సమానంగా కలిపి రసమంతా ఇగిరిపోయి నూనె మాత్రం మిగిలేలా మరిగించి చల్లార్చి వడగట్టి నిలువు వుంచుకోవాలి.
దీనిని పొట్టపైన మర్దన చేస్తుంటే ఉదరంలోని క్రొవ్వు కరిగి పొట్ట తగ్గుతుంది.