అశ్వగంధతో .. ఉపయోగాలు

Uses of Ashwagandha

Uses of Ashwagandha

ఆధునిక పరిశోధకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న ఔషధ మొక్కలో అశ్వగంధకు ప్రముఖస్థానం ఉంది.
సొలనేసి కుటుంబానికి చెందిన దీని శాస్త్రీయనామం విథానియా సోమ్మీఫెరా. వివిధ ప్రాంతాల్లో పెన్నేరు, బొమ్మడోలుగడ్డ చెట్టు అని పిలుస్తుంటారు. సంస్కృతంలో అశ్వ అంటే గుర్రమని, గంధ అంటే వాసన లేదా శక్తి అనే అర్థంలో ఈ ఔషధం గుర్రపు వాసనను కలిగి వుంటుంది. లేదా గుర్రం లాంటి శక్తిని కలిగిస్తుంది. కావున అశ్వగంధ అని పిలుస్తారు. అట్లే పంది చెవుల వంటి ఆకులు కలిగియున్నందున దీనిని వారాహకర్ణి అని, శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది కనుక బలద అని ఈ మొక్కకు పేర్లున్నాయి.

ఈ నేపథ్యంలో పేరులేని వ్యాధికి పెన్నేరు మందు అనే నానుడి గురించి ప్రస్తావించుకోవటం సందర్భోచితం.
ఎండిన పెన్నేరు గడ్డలు, అశ్వగంధ చూర్ణం పచారీ కొట్లలో దొరుకుతాయి. దీనిలోని విలువైన ఔషధ గుణాలను తెలుసుకుందాం. అశ్వగంధ చూర్ణం, పటిక బెల్లం సమంగా కలిపి ఒక స్పూను వంతున రోజూ రెండుమార్లు పాలలో కలుపుకుని కొద్దిగా నెయ్యి చేర్చి సేవిస్తుంటే స్త్రీలలో అధిక రుతుస్రావం, తెల్లబట్ట తగ్గుతాయి. గర్భిణులకు కలిగే నీరసం పోగొట్టి గర్భస్థ శిశుపోషణ జరుగుతుంది. బాలింతల్లో పాలు వృద్ధి అవుతాయి. పురుషుల్లో శుక్రనష్టం, స్వప్న స్థలనాలు తగ్గుతాయి.

చిక్కి శల్యమైన వారికి మాంసం వృద్ధి అవుతుంది. ఎముకల నొప్పులు, కాళ్లు, చేతులు వణుకుట, మంటలు, వాత వ్యాధులు తగ్గుతాయి. మెదడుకు సంబందించిన వివిధ రుగ్మతల్లో మంచి ప్రయోజనకారి. చక్కటి నిద్ర పడుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆందోళన, ఆత్రుత తగ్గుతాయి. పక్షవాతం, కీళ్ళ నొప్పలు వంటి వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు.

అశ్వగంధ, అతి మధురం, కరక, తాడి, ఉసిరిక చూర్ణాల్ని సమంగా కలుపుకొని ఒక స్పూను వంతున రోజు రెండుసార్లు తెనెతో కలిపి సేవిస్తుంటే కంటి దృష్టి మెరుగవుతుంది. వివిధ నేత్ర వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అశ్వగంధ చూర్ణాన్ని నువ్వుల నూనెలో కలిపి ఆయాభాగాలపై పట్టిస్తుంటే తామర, గజ్జి, చిడుము, గాయాలు, పుండ్లు, గడ్డలు త్వరగా మానుతాయి.

Also Read కానుగ చెట్టుతో..చర్మవ్యాధులకు చెక్

అశ్వగంధ, పిప్పలి చూర్ణాలకు తగినంత తేనె, నెయ్యి, పంచదార కలిపి సేవిస్తుంటే క్షయవ్యాధి త్వరగా తగ్గుతుంది. రెండు స్పూన్ల అశ్వగంధ పొడిని రెండు గ్లాసుల నీళ్లలో వేసి అరగ్లాసు – నీరు మిగిలేలా మరిగించి, చల్లార్చి వడగట్టి మరల ఆ కషాయాన్ని అరగ్లాసు ” పాలలో కలిపి పాలు మిగిలేలా మరగించి చల్లార్చి కొద్దిగా నెయ్యి కలిపి బహిష్టు అనంతరం క్రమంగా కొన్నాళ్ళు సేవిస్తే స్త్రీలలో వంధత్వం తొలగి సంతానావకాశాలు మెరుగవుతాయి. అశ్వగంధ వేరులోవిధాపెరిన్-ఎ సోమ్నిఫెరిన్, విధనాల్, విధనోలైడ్-బి, క్యూజియో హైగ్రిన్, అనహైగ్రిన్, అనాఫెరిన్ మొదలగు వివిధ రసాయనిక అంశములు, ఆకుల్లో పొటాషియం నైట్రేట్ కూడా ఉన్నట్లు కనుగొన్నారు.

అశ్వగంధతో .. ఉపయోగాలు

ఒకభాగం అశ్వగంధ చూర్ణానికి రెట్టింపు శొంఠి చూర్ణం కలిపి ఈ మొత్తానికి సమానంగా పటిక బెల్లం పొడి కలిపి వుంచుకుని అర చెంచా మోతాదుగా ఉదయం, సాయంత్రం ఆవు పాలతో కలిపి సేవిస్తే కీళ్ళ నొప్పులు ఉపశమిస్తాయి. ఇదే ఔషధం సయాటికా, కండరాల నొప్పులు, నడుము నొప్పి, కాళ్ళు చేతుల మంటలు, తిమ్మిర్లు, మొద్దుబారిపోయినట్లుండటం తదితర ఇబ్బందుల నుంచి విముక్తి కలిగిస్తుంది.

అశ్వగంధ చూర్ణంలో నాలుగవ వంతు కర్పూర శిలాజిత్ భస్మాన్ని కలిపి వుంచుకుని అరచెంచా మోతాదుగా ఉదయం, సాయంత్రం ఆవు పాలతో కలిపి సేవిస్తే సిబ్బెం అనే చర్మ వ్యాధిలో సత్ఫలితాలు కలుగుతాయని తాళపత్ర గ్రంథాల్లో రాయబడివుంది.

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

పెన్నేరు దుంపల్ని కాల్చిన భస్మాన్ని పావు స్పూను వంతున తేనెతో రోజుకి రెండు, మూడు సార్లు సేవిస్తుంటే దగ్గు, ఉబ్బసం, ఇతర కఫ సంబంధ వ్యాధుల్లో సుగుణం కనిపిస్తుంది. అశ్వగంధ వేరు చూర్ణం అంక్సైటి న్యూరోసిస్, ప్రారంభ దశలోనున్న కీళ్లవాతం (రుమటాయిడ్ అర్రయిటిస్) వ్యాధిలో సత్ఫలితాలనిచ్చినట్లు వివిధ పరిశోధనల్లో గమనించారు. మణిపాల్లోని కస్తూర్భా వైద్య కళాశాలలో జరిపిన పరిశోధనలలో ఈ మొక్క కేన్సర్ కారక కణాల పెరుగుదల రేటును గణనీయంగా తగ్గించటమే కాక, త్వరగా వ్యాధి తగ్గటానికి సహకారి ఔషధంగా ఉపయోగపడినట్లు తెలిసింది. కేన్సర్పై రేడియేషన్ ప్రభావాన్ని పెంచటంతోపాటు రేడియేషన్ నుంచి ఆరోగ్య కణాలకు కలిగే హాని నుంచి రక్షణ కూడా కలిగించినట్లు గమనించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top