ఉపాధి హామీ పై ఈ నెల 23 న జరిగే గ్రామ సభల్లో మెమోరాండంలు సమర్పించండి.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
ఈ నెల 23 న ఉపాధి హామీ పనులను గుర్తించే (24-25 ఆర్థిక సంవత్సరానికి) గ్రామ సభల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నుండి మెమొరాండాలు సమర్పించాలని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు లు సంఘం కార్యకర్తలను ఒక ప్రకటనలో కోరారు.
ఉపాధి హామీలో కూలీలకు ఉపయోగపడే పనులను మాత్రమే గుర్తించాలని, చట్టంలో పొందుపరచిన చాలా పనులు కనుమరుగయ్యాయని అన్నారు.
అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని, ఉపాధి కూలీలకు సక్రమంగా వంద రోజులు కూడా పనులు కల్పించడం లేదని అన్నారు.
ఉపాధి హామీ పనుల మీద నమ్మకం లేక రాయలసీమ ప్రాంతంలో విపరీతంగా వలసలు వెళ్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామసభల్లోనే పనులు గుర్తించాలని పిలుపునివ్వడం శుభ పరిణామం అని అన్నారు.
ఇది గతంలో కనుమరుగైందని వారు తెలిపారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కేవలం గుంతలు తవ్వడానికే పరిమితం కాకుండా, చట్టంలో ఏవైతే పొందుపరిచారో ఆ పనులు చేపడితే ఉపాధి కూలీలకు పనులు దొరుకుతాయని వారన్నారు.
ఉపాధి కూలీలకు పని అడిగిన ప్రతి ఒక్కరికి 200 రోజులు పని దినాలు, రోజు కూలి 700 రూపాయలు ఇవ్వాలని, మజ్జిగ, త్రాగునీరు,
మెడికల్ కిట్లు, గుడారాలు, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని, రెండు పూటలా పని విధానం, ముఖ ఆధారిత హాజరు తీసివేయాలని, ఉపాధి కూలీలు పని చేసిన పెండింగ్ బకాయిలు,
వంద రోజులు పని పూర్తి చేసుకున్న ఉపాధి కూలీలకు పనిముట్లు అందేలా, జాబ్ కార్డుల్లో ఉన్న ప్రతి 18 ఏళ్లు దాటిన వారందరికీ
100 రోజులకు తగ్గకుండా పనులు కల్పించాలని, ప్రమాదం జరిగితే వెంటనే నష్ట పరిహారం రూ.5 లక్షలకు తగ్గకుండా ఇవ్వాలని కోరారు.
ఆ మేరకు గ్రామసభల్లో జిల్లా కమిటీలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నుండి మెమోరాండాలు సమర్పించాలని వారు కోరారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
ఉపాధి నిధులను ఇతర మార్గాలకు మళ్ళించకుండా కేవలం ఉపాధి కూలీలతో పనులు చేసేలా చూడాలని, యంత్రాలు, కాంట్రాక్టర్ల వ్యవస్థను నిషేధించాలని,
గ్రామాల్లో పనులు చేపట్టడానికి ఐదు ఎకరాలు నుండి పది ఎకరాలు వరకు పెంచాలని సంఘం నాయకత్వం కోరాలన్నారు.
ఎక్కడైతే అవినీతి జరిగిందో వాటిని వెలికితీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. పండ్ల తోటల పెంపకమునకు 5 ఎకరాల సీలింగ్ ను 10 ఎకరాల వరకు పెంచాలన్నారు.