మామిడి ఈ పేరు చెప్పగానే ఉగాది పండుగ గుర్తుకు వస్తుంది ఎందుకంటే ఉగాదికి మామిడి ఆకులతో పచ్చడి చేసుకోవడం,
ఆ పచ్చడి యొక్క తీపి-చేదుల కలబోత తెలుగు కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది కనుక. ఉగాదికి కొద్ది రోజుల తరువాత మామిడి కాయలు మార్కెట్లోకి రావడం సర్వ సాధారణం.
తెలుగు నేలన ఎన్నో శుభకార్యాలలో మామిడి ఆకులను విరివిగా వాడుతుంటారు. అంటే మామిడి మన సంస్కృతి, సంప్రదాయాలలో కూడా బాగం అయిందని అర్థం.
తెలుగు రాష్ట్రాలలో మామిడి అంటే మక్కువ ఎక్కువ అటు తినేవారికి ఇటు పండించేవాళ్లకు. మామిడిలో చాలా రకాలు ఉంటాయి.
ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకం పండుతుంది. ఒక్కోరకం ఆయా ప్రాంతాలలో కొనుగోలుకు ఎక్కువ మక్కువ చూపిస్తారు వినియోగదారులు.
ఉదాహరణకు కోస్తా ప్రాంతంలో రసాలు చాలా బాగా ఇష్టపడతారు, అలాగే బంగినపల్లి కూడా. ఇలా మామిడిలో చాలా రకాలు ఉన్నాయి.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ప్రకాశం జిల్లాలో ఉలవపాడు. ప్రకాశం జిల్లాకు, నెల్లూరు జిల్లాకు బోర్డర్ ఈ ఉలవపాడు గ్రామం. నెల్లూరు జిల్లా కావాలి పట్టణమునకు ఇంచుమించు 25 కిలోమీటర్లు దూరంలో,
ఒంగోలు నుండి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భవిష్యత్ లో నిర్మాణం జరిగితే రామాయపట్నంకు కూడా దగ్గరగానే ఉంటుంది.
ఉలవపాడుకు దగ్గరగా వచ్చాక హైవే రోడ్ కి అటూ ఇటూ రెండు వైపులా మామిడి తోటలు ఎల్లప్పుడూ మనకు కనబడతాయి. ఈ ప్రాంతంలో మామిడి తోటలు
ఎప్పటినుండో ఉన్నట్లు ఏళ్లతరబడి చెట్లలా మంచి ఆహ్లదకర వాతావరణంలో ఉంటాయి. ప్రకాశం జిల్లాలో మామూలుగానే హార్టికల్చర్ అంటే..
అంత మక్కువ చూపేవారుకాదు అప్పట్లో. కానీ ఈ ఉలవపాడులో మామిడి, అక్కడక్కడ సపోటా తోటలు కూడా కనపడతాయి.
ఉలవపాడు మామిడికి దేశంలో ఒక ప్రత్యేకత
ఈ మామిడి సీజన్లో ఉలవపాడు ప్రాంతం చేరుకోగానే హైవే రోడ్డుకు ఇరువైపులా గోతాలతో చిన్న చిన్న టెంట్లు వేసి దాదాపు రెండు వందల షాప్స్ లో మామిడి వివిధ రకాలు అమ్ముతుంటారు. రకాలను బట్టి కిలో 50 రూపాయలనుండి ఉంటుంది. కాకపోతే అన్ని షాప్స్ లలో హైవే పక్కన అలా మామిడి పండ్లను చూస్తుంటే ఆ అనుబూతే వేరు. కొంత మంది రైతులు పొలం నుండి మామిడి పళ్లు కోసుకుని అక్కడే అమ్ముతుంటారు. కాబట్టి అటు రైతులకు, ఇటు వినియోగదారులకు లాభం. రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారునుకి నాణ్యమైన మామిడి పళ్లు తక్కువ దరలోనే దొరుకుతాయి. హైవే మీద కాబట్టి వివిధ రాష్ట్రాల వాళ్ళు మన ఉలవపాడు మామిడి పండ్లను కొనుగోలుచేస్తుంటారు. ఇతర రాష్ట్రాల, ఇతర జిల్లాల లారీ డ్రైవర్స్, కార్లలో ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కువగా ఇక్కడ మామిడి పండ్లు కొంటున్నారు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ఉలవపాడు అంటేనే మామిడికి దేశంలో ఒక ప్రత్యేకత. ఇక్కడ లభ్యమయ్యే మామిడి పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి. తాజా మామిడి పండ్లు కాబట్టి ఎక్కువ రోజులు కూడా చెడిపోకుండా ఉంటాయి. మామిడి సీజన్ బేస్డ్ ఫ్రూట్ కాబట్టి ఈ సీజన్లొనే లభ్యమవుతుంది. మీరు ఆ వైపు ప్రయాణం చేసేటప్పుడు తప్పక ఆస్వాదించండి మా.. ఉలవపాడు మామిడిని
– అశోక్ కుమార్ మల్లిపెద్ది