గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్

Two suspects arrested for selling marijuana

Two suspects arrested for selling marijuana

చిత్తూరు జిల్లా పోలీసు
పత్రికా ప్రకటన

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసిన పలమనేరు రూరల్ పోలీసులు.

సుమారు 31,500 రూపాయలు విలువ గల 2 కిలోల 100 గ్రాముల గంజాయి స్వాధీనం.

చిత్తూరు జిల్లా నందు అక్రమ విక్రయాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తూ భద్రతా చర్యలు చేపడుతూ జిల్లా అంతటా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

ఈ చర్యలలో భాగంగా పలమనేరు సబ్-డివిజన్ డి.ఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ గారి పర్యవేక్షణలో పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ పరశురాముడు గారు గంజాయి మరియు ఇతర మత్తుపదార్ధాల పై ఉక్కుపాదం మోపుతున్నారు.

ఈ క్రమంలో ఈరోజు పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు ఉదయం సుమారు 11.00 గంటలకు పెద్దపంజాని మండలం, రామాపురం గ్రామ సమీపాన బసాపురం క్రాస్ వద్ద ఇన్స్పెక్టర్ గారు మరియు పెద్దపంజాని PSI శ్రీ మారెప్ప మరియు సిబ్బంది గంజాయి విక్రయిస్తున్న A1 షైక్ మస్తాన్ మరియు A2 శ్యామలను గంజాయిని విక్రయిస్తుండగా పట్టుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.

దర్యాప్తులో భాగంగా A2 ముద్దాయి శ్యామల తాను విజయవాడ నందు గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి పెద్దపంజాని నందు A1 ముద్దాయి షేక్ మస్తాన్ తో కలిసి విక్రయిస్తున్నట్టు ఒప్పుకోవడం జరిగిందని పలమనేరు డి.ఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ గారు తెలిపారు.

వీరిపై cr.no :Cr. No 149/25, u/s 20(b), 2(b) of NDPS act కింద పంజాని పోలీస్ నందు పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ పరశురాముడు గారి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.

ముద్దాయిల వివరాలు:

A1 – షేక్ మస్తాన్, వయస్సు : 57 సం. లు, తండ్రి : అజీజ్ సాబ్, శంకరాయల పేట, పంజాని మండలం, చిత్తూరు జిల్లా.
A2 – శ్యామల, వయస్సు : 30 సం. లు, w/o శివ, భగత్ సింగ్ కాలనీ, పుంగనూరు, చిత్తూరు జిల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top