మహానంది సమీపంలోని జినశంకర తపోవనం రహదారిలో అయ్యప్ప దీక్ష స్వీకరించిన భక్తులకు చెందిన 42 ఇరుముడులు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. విజయనగరానికి చెందిన అయ్యప్పదీక్ష భక్తులు దైవదర్శనం కోసం ప్రత్యేక బస్సులో సోమవారం రాత్రి మహానంది క్షేత్రానికి వచ్చారు. దర్శనం తర్వాత రాత్రి 12 గంటల సమయంలో మహానంది నుంచి గాజులపల్లి రహదారి మీదుగా అయ్యప్ప భక్తుల బస్సు వెళ్తుండగా మార్గమధ్యంలోని జి శంకర తపోవనం వద్దకు బస్సు చేరుకోగానే బస్సు వెనుకవైపు డిక్కీ సౌండ్ వస్తుండగా బస్సు ఆపారు. 42 ఇరుముడులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకొని పారి పోయినట్లు చెప్పారు. విషయాన్ని మహానంది పోలీసులకు అర్ధరాత్రి దీక్షాపరులు తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా మంగళవారం ఉదయం నంద్యాల రూరల్ సీఐ రవీంద్ర మహానంది పరిసరాలతో పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయ్యప్ప దీక్షాపరులకు చెందిన ఇరుముడులు చోరికి గుర య్యాయన్న సమాచారం మేరకు తాను టోల్ గేట్ పాటు ఇతర పరిసరాల్లో విచారించానని సీఐ చెప్పారు.
అయ్యప్ప స్వాముల ఇరుముడులు చోరీ
