మాజీ ఎంపీపీ జిఎం.. లక్ష్మి దేవమ్మ కు ఘన నివాళి
నంద్యాల జిల్లా : పాములపాడు మాజీ ఎంపీపీ జిఎం లక్ష్మి దేవమ్మ గత వారం రోజుల క్రితం తన నివాసంలో ఇంట్లో దీపారాధన చేస్తుండగా పరమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ఆమెను హుటా హుటీగా బంధువులు కర్నూలు లోని గౌరీ గోపాల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం అందించినప్పటికీ 70% పైగా శరీర భాగం కాలిపోవడంతో కోలుకోలేక ఆదివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందారు.

అంత్యక్రియల నిమిత్తం ఆమె స్వగ్రామం అయినటువంటి పాములపాడు లోని నివాసానికి తరలించి సోమవారం ఉదయం 10 గంటలకు సంప్రదాయ ప్రకారం గ్రామ శివారులోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు, సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే గిత్తా జయ సూర్య, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు పార్థివ దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.

లక్ష్మి దేవమ్మ మరణ వార్తను తెలుసుకున్న శ్రీశైలం టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో చరవాణి ద్వారా ఆమె కుమారుడు జిఎం రవికుమార్ కు ఫోన్ చేసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మాజీ ఎంపీపీ జిఎం లక్ష్మి దేవమ్మ ( ఫైల్ ఫోటో )