గిరిజనుల హక్కుల పరిరక్షణకు కృషి…… శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
జనవరి 7న జరిగే గిరిజన శంఖారావం గోడపత్రికలను ఆవిష్కరించిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు, జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్ వెలుగోడు వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, ఎస్ ఎన్ తండా సర్పంచ్ శివ నాయక్, ఎంపిటిసి వెంకటేష్ నాయక్, మాజీ సర్పంచ్ బాలు నాయక్
రాష్ట్రంలోని గిరిజనుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి అన్నారు.
సోమవారం ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్వగ్రహంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్ ఆధ్వర్యంలో వచ్చేనెల 7వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే గిరిజన శంఖారావం గోడపత్రికలను ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. గిరిజనులు అన్ని రంగాల్లో రాణించి మరింత అభివృద్ధి చెందాలని కోరారు. నంద్యాల జిల్లాలోని గిరిజనులు అత్యధిక సంఖ్యలో శ్రీశైలం నియోజకవర్గం లో ఉన్నారని వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. గిరిజనులు హక్కుల పరిరక్షణ ధ్యేయంగా కలిసికట్టుగా ముందుకెళ్తే మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు. రాష్ట్రంలోని ఉన్న గిరిజనులు సంకటితమైతే సభ విజయవంతం అవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున, శిల్పా కుటుంబం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటుందని తెలిపారు. రేపు జరగబోయే గిరిజన శంఖారావం కార్యక్రమం విజయవంతం కావడానికి నా నియోజకవర్గ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారి అభివృద్ధికి పాటుపడతామని గిరిజనులకు భరోసా ఇచ్చారు. పోస్టర్ ఆవిష్కరణలో జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, వెలుగోడు వైస్ ఎంపీపీ కోడావత్ శంకర్ నాయక్, ఎస్ ఎన్ తండా సర్పంచ్ శివనాయక్, ఎంపిటిసి వెంకటేష్ నాయక్, కొట్టాల చెరువు శివ నాయక్, భానుముక్కల మాజీ సర్పంచ్ బాలు నాయక్, మహేంద్ర నాయక్, రామస్వామి నాయక్, వైసిపి నాయకులు మరియు జిపిఎస్ యువజన నాయకుడు విక్రమ్ నాయక్, జిపిఎస్ నేతలు పాల్గొన్నారు.