ఎలుగుబంట్లు… ఎందుకు మృత్యుఘోష పడుతున్నాయి…!
ఆత్మకూరు వన్య ప్రాణి డివిజన్లో అంతు చిక్కని మృతి
ఎలుగుబంటిల సంరక్షణకు రక్షణ కరువు
గత నెల రోజుల నుంచి రైతుల పంట పొలాలలో మకం వేసిన వెలుగు బంటులు
ఆత్మకూరు డిసెంబర్16 సగినాల రవి కుమార్ .. సీనియర్ జర్నలిస్టు
నల్లమల్ల అడవి ప్రాంతంలో నివవశించాల్సిన వన్యప్రాణులు పంట పొలాల్లో విలవిలలాడుతూ మృతి ఘోష పడుతున్నాయి..
అసలు ఎందుకు ఎలుగుబంట్లు వరుసగా మృతి చెందుతున్నాయి..
కారణాలు ఏమిటి అనే పలు విషయాలు తెలియాల్సి ఉంది.
ఎలుగుబంట్లు ఈ ప్రాంతంలోనే ఎందుకు తిరుగుతున్నాయి.
గత నెల రోజుల నుంచి కంటిపై కునుకు లేకుండా చేస్తున్న ఎలుగుబంట్లు ఎందుకు హల్చల్ చేస్తున్నాయి.రైతులపై దాడి చేస్తున్నాయి.
నల్లమల్ల అటవీ ప్రాంతం ఆత్మకూరు వన్యప్రాణి డివిజన్ పరిధిలో వెలుగోడు రేంజ్ ఆత్మకూర్ రేంజ్ రెండు సరిహద్దుల మధ్యలో ఎలుగుబంట్లు హల్ చల్ చేస్తున్నాయి.
గత నెల రోజుల నుంచి ఆ రేంజ్ పరిధిలో రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. అడవిని వదిలి జనవాసంలోకి వస్తున్న వన్యప్రాణులకు రక్షణ కరువవుతుందని చెప్పవచ్చు.
చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో అడవి ఉండడంతో వన్యప్రాణులకు కావలసిన ఆహారం కోసం జనవాసంలోకి బయలుదేరుతున్నాయి.
వీటన్నిటినీ సంరక్షణ చేయవలసిన అటవీశాఖ అధికారులు ఇప్పటికి నిద్రమత్తు వీడలేదని చెప్పవచ్చు. గత నెల రోజుల నుంచి ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ పరిధిలో పాములపాడు మండలం బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద తెలుగు గంగ నీటిలో ఓ ఎలుగుబంటి మృతి ఘోష నీళ్లలో తేలాడుతూ కనిపించింది.
ఎలుగుబంటిపై స్మగ్లర్ల వేట .. లేక రైతుల దాడులా .. అనేది నేటికీ అర్థం కావడం లేదు. అంతుచిక్కని విధంగా వన్యప్రాణులు మృతి ఘోష పడుతూనే ఉన్నాయి.
నల్లమల్ల పెద్ద పులుల అభయారణ్యంలో ఒకవైపు పులి ఉచ్చులో పడి మృతి చెందుతుంటే మరోవైపు ఎలుగుబంటి తెలుగు గంగ కాలువలో మృత్యువాత పడి నీళ్లలో తేలాడుతున్నాయి.
చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత ప్రజలకు విషయాలు అడిగి తెలుసుకుంటే గత నెల రోజుల నుంచి శ్రీశైలంకుడి ఒడ్డు కాలువ వైపు అధిక సంఖ్యలో ఎలుగుబంట్లు మకాం వేస్తున్నాయని ఇదివరకే అటవీశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళటం జరిగిందని రైతులు చెబుతున్నారు.
గత మూడేళ్ల క్రితం ఓ ఎలుగుబంటి భానుముక్కల పంట పొలాల వద్ద దాహార్తి తీర్చుకునేందుకు తల్లితో పాటు పిల్లలు అక్కడికి వచ్చాయి.
రిస్క్యూ వ్యాన్ తో అటవీ శాఖ అధికారులు వాటిని అడవిలోనికి తరలించేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది.
ఎలుగుబంటి వాటి పిల్లలు మృత్యువాత పడిన సంఘటన అక్కడ ఉన్న ప్రజల్ని ఆశ్చర్యపరిచింది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నప్పటికీ ఇవన్నీ సర్వసాధారణం అనుకుంటూ అటవీ శాఖ అధికారులు విధి నిర్వహణలో కొందరు ముందుకు వెళుతుంటే మరికొందరు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో ఇలాంటి సంఘటనలు కనిపించకుండా బయటికి పోకుండా రహస్యంగా ఎన్నో ప్రాణాలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి.
ఎలుగుబంట్లు మృత్యు ఘోష
ప్రస్తుతం భానకచర్ల రెగ్యులేటర్ సమీపంలో ఎర్రగూడూరు , భానుముక్కల ఈ గ్రామాల మధ్యలో చిట్టడివి ఉండటంతో మరోవైపు రైతులు సాగు చేసుకుంటున్న పచ్చని పంట పొలాలు ఉండటంతో ఎలుగుబంట్లు.. తల్లి , పిల్లలు జనవాసంలోకి అలవాటు పడుతున్నాయి.
రాత్రివేళ సమయంలో బిక్కుబిక్కుమంటు రైతులు సాగుచేసిన పంటలను కాపాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది మరికొన్నిచోట్ల అడవి పందుల బెడద అధికంగా ఉండటంతో రాత్రివేళ సమయంలో కరెంట్ సరఫరా చేయడంతో ఎన్నో ప్రాణులు మృతి చెందుతున్నాయి.
గత సంవత్సరంలో ఆత్మకూరు రేంజ్ లోని కపిలేశ్వరం సమీపంలో మొక్కజొన్న పొలానికి చుట్టూ కరెంటు తీగలు సరఫరా చేయటంతో ఓ ఎలుగుబంటి కళ్ళముందే ఖాళీ బూడిద పాలయింది.
ఆ విషయం కాస్త అటవీ శాఖ అధికారులు ఆలస్యంగా వెలుగులోనికి తెచ్చారు. ఒక సంఘటన మరువకముందే మరో సంఘటన జరుగుతూనే ఉంది.
వన్యప్రాణుల సంరక్షణపై నిర్లక్ష్యమా.. లేక స్మగ్లర్ల చేతుల్లో.. రైతుల చేతుల్లో.. వేటగాడివోచ్చులో.. బలైపోతున్న వన్యప్రాణులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ఎవరిపై ఉందని పలువురు వన్యప్రాణి ప్రేమికులు చర్చించుకోవడం ఆత్మకురు అటవీ డివిజన్ పరిధిలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.
సగినాల రవి కుమార్ .. సీనియర్ జర్నలిస్టు