గిరిజన విద్యార్థులకు న్యాయం చేకూర్చండి..
జై భీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా యూత్ ప్రెసిడెంట్ రామావత్ చందు నాయక్
డిసెంబర్ 10 న్యూస్ అనంతపురం
రాష్ట్రవ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో విద్యనభ్యస్తునటువంటి గిరిజన విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని , మంగళవారం నాడుJBP జిల్లా యూత్ ప్రెసిడెంట్ రామావత్ చందు నాయక్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది..
ఈ సందర్భంగాJBP జిల్లా యూత్ ప్రెసిడెంట్ రామావత చందు నాయక్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా గిరిజన గురుకులాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి టీచింగ్ ఉద్యోగస్తులు అందరూ వారికి చాలిచాలినంత జీతాలతో తమ జీవితాలను నెట్టుకొస్తున్నామనేటువంటి ఆవేదనతో, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వారు చేపట్టినటువంటి సమ్మె దాదాపుగా నెల రోజులు కావస్తున్నా, వారికి ఎటువంటి నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ప్రకటించకపోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా గిరిజన గురుకుల నందు విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు సకాలంలో సిలబస్పూర్తిగాక, పూర్తిగా రోడ్డున పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అంతేకాకుండా మార్చి 15వ తేదీ నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సిలబస్ పూర్తి కాకపోవడం, ఆ విద్యార్థులకు ఆందోళనకరంగా మారడం జరిగిందని
గిరిజన విద్యార్థుల మీద ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉన్నట్లయితే, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసి, నిర్ణత సమయంలోపల పదవ తరగతి సిలబస్లను పూర్తి చేసి వారికి న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన తెలిపారు.
లేనిపక్షంలో పూర్తిస్థాయిలో గిరిజన విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిJBP జిల్లా యూత్ ప్రెసిడెంట్ రమావత్ చందు నాయక్ పేర్కొన్నారు..
ఈ అంశం మీద మంత్రి నారా లోకేష్, మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను అతి తొందరగా పరిష్కరించి, గిరిజన విద్యార్థుల పట్ల అండగా నిలబడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం గిరిజన యువ నాయకుడు సభావాత్ గోవింద నాయక్ హరికృష్ణ తేజ నాగమూర్తి విష్ణు పవన్ రాజేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు