కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కవచం : ఎమ్మెల్యే బుడ్డా

Srisailam Tdp Leaders Pramana sweekaram

Srisailam Tdp Leaders Pramana sweekaram

కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కవచం : ఎమ్మెల్యే బుడ్డా పండుగలా తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారం,పదవి ఒక బాధ్యతగా స్వీకరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి జెండా రెపరెపలాడాలి,ఏడాదిన్నర పాలనలోనే రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు.ఆత్మకూరు ( 11 నవంబర్ ) : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తేలే కవచమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన శ్రీశైలం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ మరియు బూత్ స్థాయి కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి, దివంగత టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు, దివంగత మాజీ మంత్రి బుడ్డా వెంగళ రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బుడ్డా నివాళి అర్పించారు. అనంతరం నూతనంగా ఎంపికైన ఆయా కమిటీ సభ్యులచే ఎమ్మెల్యే బుడ్డా స్వయంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు కేక్ కట్ చేసి వారి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అంటేనే విలువలు, విశ్వసనీయత, క్రమశిక్షణకు మారుపేరని.. కార్యకర్తల త్యాగాల వల్లే నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం కలుగుతుందన్నారు. నూతనంగా మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, యూనిట్, గ్రామ, మరియు బూత్ కమిటీల సభ్యులు క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తూ.. పార్టీ శ్రేణులను సమన్వయము చేసుకోవాలని పిలుపునిచ్చారు. 18 నెలల ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని కొలమానంతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రతి కార్యకర్త సైనికుడివలె పని చేసి అన్ని గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. గత వైసిపి ప్రభుత్వంలో నాయకులవలె ప్రతిపక్షాలు నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకోవడం, బెదిరించడాలు ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఉండవని ప్రజాస్వామ్య బద్దంగానే ఎన్నికలకు వెళ్తామన్నారు. ఏడాదిన్నర పాలనలోనే రూ.200 కోట్ల నిధులతో శ్రీశైలం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పలు చేసి అప్పుల కుప్పగా మార్చారన్నారు. నూతన కమిటీలు పార్టీకి, ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం పాటుపడాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వారికీ సూచించారు. కూటమి ప్రభుత్వం చేసే మంచి పనుల ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ.. వైకాపా నాయకులూ చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేసి కేనాల్ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, సీనియర్ నాయకుడు కంచర్ల సురేష్ రెడ్డి, మహానంది ఎంపిపి బుడ్డా రెడ్డి యశస్విని, మార్కెట్ యార్డు చైర్మన్ కృష్ణా రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, రవీంద్రబాబు, వేణు గోపాల్ , ఎం.ఏ కలాం, నాగ కృష్ణా రెడ్డి, శివ శంకర్, క్లస్టర్ ఇంచార్జిలు రమణ, ఉమా, రాజారెడ్డి, దినకర్, షాబుద్దీన్, ఖలీల్, రఘుస్వామి రెడ్డి, మౌళీశ్వర రెడ్డి, నాయకులు అబ్దులాపురం బాషా, శివప్రసాద్ రెడ్డి, శశికళ, మల్లికార్జున రెడ్డి, కలీముల్లా, శ్రీశైల దేవస్థాన బోర్డు సభ్యులు భరద్వాజ శర్మ, గంగమ్మ, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్, PACS చైర్మన్లు షాబుద్దీన్, శివ శంకర్ రెడ్డి, ఉమా మహేశ్వర రెడ్డి, సాయిబాబ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తిరుపమయ్యా, కౌన్సిలర్లు మహాబతుల్లా, హరి ప్రసాద్, నూర్ బేగ్, ఖలీలుల్లా, రామూర్తి, సతీష్ బాబు, అలీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top