భారతరాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సోమవారం శ్రీశైలంలో పర్యటిస్తున్నందున అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీశైలం వెళ్లే భక్తులు డిసెంబర్ 26 సోమవారం పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. శిఖరేశ్వరం మరియు లింగాలగట్టు పాయింట్లవద్ద ఉదయం 11 గంటలకు వాహనాలు నిలిపివేస్తారు. శ్రీశైలానికి వచ్చే వాహనాలను ఒంటిగంటకు శిఖరేశ్వరం, లింగాలగట్టువద్దరాకపోకలు తిరిగి అనుమతిస్తారు. వాహనాలు శ్రీశైలం చేరిన వెంటనే రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ప్రదేశాలలో పార్కింగ్ చేయబడతాయి. అక్కడి నుండి వాటిని ఆలయo సముదాయం లేదా వారి కాటేజ్ లకు నిదానంగా కొంత సమయం తర్వాత అనుమతిస్తారు. పార్కింగ్ ప్రదేశంలో ఉన్న భక్తులు పోలీసు వారి అనుమతి వచ్చేవరకు సహనం పాటించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. తదుపరి వాహనాలు మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ నిలిపివేయబడతాయి. అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి సుండిపెంటనుండి మరియు శిఖరం వైపు నుండి వాహనాలరాకపోకలు తిరిగి అనుమతించబడతాయి. శ్రీశైలంలో ఉన్న వసతి గృహాలు చాలావరకు బందోబస్తు నిమిత్తం ఏర్పాటుచేసినభద్రతసిబ్బందికి మరియు ఇతర శాఖల సిబ్బందికి కేటాయించినందున సోమవారం చాలా ఇబ్బంది ఉంటుందని భక్తులు వీటన్నిoటిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు సాగించవలసిందిగా పోలీసులు కోరుతున్నారు. శ్రీశైల వచ్చేవారు ఉదయం 10 గంటల లోపు వచ్చే విధంగా చూసుకోవాలి. శ్రీశైలం నుండి బయలుదేర వారు ఉదయం 9 గంటల లోపు బయల్దేరి వెళ్లిపోయే చూసుకున్న ఎడల ఎలాంటి అసౌకర్యాలకు లోను కాకుండా ఉంటారని, భారత రాష్ట్రపతి పర్యటన ను ప్రయాణికులు భక్తులు దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఆంక్షలు పాటించవలసిందిగా నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు.