శ్రీశైలం క్షేత్రంలో వివాదాస్పదంగా మారిన లలితాంబిక దుకాణాల సముదాయాల కేటాయింపు ఎట్టకేలకు కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఖాళీ చేయకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రతి షాపు యజమానులకు అధికారులు తెలిపారు. శ్రీశైలంలోని ఆలయానికి ఇరువైపులా ఉన్న పాత దుకాణాలను లలితాంకా సముదాయంలోకి తరలించాలని దేవస్థానం అధికారులు వ్యాపారులకు సూచించారు. హైకోర్టు మద్యంతర ఉత్తరుల ప్రకారం ఈనెల 3న 140 దుకాణాలకు దేవస్థానం అధికారులు లక్కీ డిప్ నిర్వహించారు. ఇందులో 101 మంది కోర్టు ఉత్తర్వులతో డిప్ పద్దతిలో పాల్గొన్నారు.
కాగా 39 మంది వ్యాపారులు గైర్హజరు కావడంతో వారి స్థానంలో ఖాళీగా ఉన్న దుకాణాలకు ఈ నెల 22వ తేదీన బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. లక్కీ డిప్‌లో పాల్గొన్న వ్యాపారులు తమ పాత దుకాణాలను లలితాంబికా సముదాయంలోకి తరలించుకోవాలని స్పష్టం చేశారు. లేనిపోతే పాత దుకాణాలకు కరెంటు, నీటి సరఫరా నిలిపివేనున్నట్లు అధికారులు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా నిర్మాణం చేపట్టిన లలితాంబిక దుకాణాలు కేటాయింపు జరిపించి పాత దుకాణాలును ఖాళీ చేయించి శ్రీశైలం క్షేత్ర అభివృద్ధి, భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించి వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు దేవాదాయ అధికారులు పావులు కదుపుతున్నారు.