సన్న ధాన్యానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీ పడి మరీ అధిక ధరకు వాటిని కొను గోలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ వాన కాలంలో దొడ్డు ధాన్యానికి బదులుగా సన్న ధాన్యాన్ని సాగుచేస్తే మేలన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్త మవుతున్నది.
సన్నాలకు మద్దతు ధర లభించడంతోపాటు పొలం వద్దకే వచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభు త్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం 17కు మించితే కొనుగోలు చేసేందుకు అధికారులు
నిరాకరిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు మా త్రం 25-30 శాతం తేమ ఉన్నా అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు.
ఈ యాసంగిలో 30 శాతం తేమ ఉన్న సన్న ధాన్యం క్వింటాలకు రూ.2400 పలికింది. మద్దతు ధర రూ. 2060కి మించి ధర పలక డంతో రైతులు సంతోషంలో మునిగిపో యారు.
ఇప్పుడు వానకాలంలోనూ సన్నా లకు భారీ డిమాండ్ ఉంటుందని వ్యాపా రులు, మిల్లర్లు చెబుతున్నారు
పండించడమే ఆలస్యం
సన్న ధాన్యం పండిస్తున్న రైతుల వద్దకే వస్తున్న మిల్లర్లు, వ్యాపారులు వాటిని కొను గోలు చేసి తీసుకెళ్తున్నారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జైశ్రీరాం, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా, బీపీటీ వంటి సన్నరకపు వరిని సాగు చేస్తున్న రైతులతో వ్యాపారులు ముందుగానే..
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
దొడ్డు బియ్యానికి కేంద్రం కొర్రీలు , తేమ, తాలు శాతానికి పరిమి తులు విధిస్తున్న కేంద్రం బియ్యం ధాన్యం కొనుగోలులో పలు నిబం ధనలు తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది.
దీంతో ధాన్యాన్ని అమ్ముకునేం దుకు రైతులు ఇబ్బందులు పడు తున్నారు. ఈ బాధల నుంచి బయటపడాలంటే సన్నాలు సాగు చేయడమే..
మంచిదన్న అభి ప్రాయం రైతుల్లో నెలకొన్నది. ఒప్పందం చేసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రా లైన కర్ణాటక,
ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా వ్యాపారులు, మిల్లర్లు వచ్చి రాష్ట్రంలోని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు..
ఈ వానాకాలం నుంచి సన్నరకం ధాన్యం పండించే రైతులకు సర్కారు అండగా నిలవనుంది. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది.
రేషన్ దుకాణాల ద్వారా తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తామని శాసనసభ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
హామీని నెరవేర్చే క్రమంలో రైతులు దొడ్డు రకానికి చెందిన ఎంటీయూ-1010, 1061 ధాన్యం పండించకుండా వ్యవసాయశాఖ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది.
వీలైనంత ఎక్కువ మంది కర్షకులు సన్నరకాల సాగుకు పూనుకునేలా చొరవ తీసుకోనుంది. సన్నాలకుచీడపీడలు సోకి తక్కువ దిగుబడులు వస్తున్నాయి.
బీపీటీ-5204 వంటి సన్నరకాలకు చెందిన వరి పంటకు అగ్గితెగుళ్లు, సుడిదోమ, కాండం తొలిచే పురుగు, ఆకుచుట్టు పురుగు వంటివి ఆశిస్తాయి.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
తెగుళ్ల మందులతో పెట్టుబడి భారం
వీటి నివారణకు వాడే పురుగు, తెగుళ్ల మందులతో పెట్టుబడి భారం అధికమవుతుంది. ఎరువులపై 5 శాతం, పురుగు మందులపై 18 శాతం జీఎస్టీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయి.
ఈమేరకు ఆయా కంపెనీలు ధరలు పెంచి రైతులపై భారం మోపుతున్నాయి. అందుకే పెట్టుబడి భారం తగ్గించుకునేందుకు, దిగుబడులు అధికంగా వచ్చే..
దొడ్డు రకాల సేద్యం వైపు అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు. హరిత విప్లవం అనంతరం 40 ఏళ్లుగా ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగి, సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో..
ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి మారిపోయింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాసిరకం మొద్దు బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేయటంతో వాటిని తినేందుకు ఇష్టపడని కొందరు కిలో రూ.10కే అమ్మేసుకుంటున్నారు.
దీన్ని నివారించేందుకే సన్నరకాలు పండించేలా రైతులను ప్రోత్సహించి పేదలకు సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) ఎంటీయూ-1010 రకం దొడ్డు ధాన్యాన్ని ‘ఏ’ గ్రేడ్గా గుర్తించి బియ్యం సేకరిస్తోంది.
బీపీటీ-5204 సన్నరకాలనూ ‘ఏ’గ్రేడ్గా గుర్తించి కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరించటంతో మిల్లర్లకు వరంగా మారింది. సన్నాలు, దొడ్డురకాలకు ఒకే ధర చెల్లించటంతో రైతులు అధికంగా దొడ్డు రకాల సాగుకు మొగ్గు చూపుతున్నారు