*వెల్లువెత్తిన ఉత్సాహం…**పోటెత్తిన జనసంద్రం…
**ఎమ్మెల్యే శిల్పా ఇంటివద్ద కొత్త సంవత్సర కోలాహలం*————అది ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న వైస్సార్సీపీ కార్యాలయం.
అది ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి నివాసం కూడా..ఆదివారం ఉదయం 7 గంటలకే జనసందోహం మొదలైంది. వారిలో పార్టీకార్యకర్తలు,
నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు.వారంతా ఎదురు చూస్తోంది అందరి ప్రేమ పాత్రుడు, అభిమాన నాయకుడు, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కోసం.
నియోజకవర్గం అభివృద్ధికోసం అనుక్షణం తపిస్తున్న శిల్పన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలి
అని అన్నివిభాగాల ప్రభుత్వ అధికారులు ..శిల్పన్నను చూడాలిఅని సామాన్యులు,.
శిల్పన్నను కలవాలి, శిల్పన్నతో కరచాలనం చేయాలి, అన్నతో సెల్ఫీలు దిగాలి అని కార్యకర్తలు, యువకులు, నాయకులు ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు….
సరిగ్గా 8.50 కి శిల్పన్న రానేవచ్చారు. అందరిలో ఉత్సాహం, ఉల్లాసం.. జైశిల్పా.. జైజగన్ నినాదాలు హోరేత్తిపోయాయి.
మరికొద్ది సేపటికే ఆప్రాంతం కిక్కిరిసి పోయింది.అది మొదలు మధ్యాహ్నం 3 గంటలవరకు క్షణంతీరిక లేకుండా గ్రామాలు, మండలాలు
సుదూర ప్రాంతాలనుండి అభిమానులు వస్తూనే ఉన్నారు. పుస్తకాలు, పెన్నులు, బొకేలతో వేలాదిమంది వచ్చి శుభాకాంక్షలు చెబుతూనే ఉన్నారు.
శిల్పన్న కూడా ఎంతో ఓపికతో చిరునవ్వుతో పలకరిస్తూ అందరితో ఆప్యాయంగా గడిపారు.*శిల్పన్న అంటే ఎందుకింత అభిమానం..?*ఇంతటి ఆదరణ ఇంకెవ్వరికైనా ఉందా..?*
సామాన్య ప్రజలు, కార్యకర్తలు, నిరుద్యోగుల గుండెల్లో ఇంతగొప్ప స్థానం సంపాదించుకోవడం శిల్పన్నకు ఎలాసాధ్యమైంది..?అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే..
ఆయన ప్రజల మనిషి.. అసలు సిసలు ప్రజా నాయకుడు.పార్టీకార్యాలయంలో శిల్పన్నతో సెల్ఫీ దిగి ఉత్సాహంతో
కేరింతలు కొడుతున్న జగదీష్ గౌడ్ అనే ఒక యువకుడిని కదిలిస్తే..
“శిల్పన్న పెట్టిన జాబ్ మేళా ద్వారా నాకు 22000 రు ఉద్యోగం వచ్చింది. నాలాగా ఎందరికో
ఉపాధి చూపించాడు” అన్నాడు. విపరీతంగా ఉన్న రద్దీలో అన్నతో కరచాలనం కోసం
ఎదురు చూస్తున్న వెంకటేష్ అనే ఒక కార్యకర్తను పలకరించినప్పుడు ఎంతో భావోద్వేగంగా బదులిచ్చాడు.”అన్న మాకోసం ఎంత కష్ట పడుతున్నాడో మాకు తెలుసు. పెద్దన్న లా మందలిస్తాడు.
తండ్రి లా దగ్గరికి తీస్తాడు. కష్టాల్లో ఆదుకుంటాడు. శిల్పన్న ఏం చేసినా ప్రజల మంచి కోసమే ” అన్నాడు.అబ్దుల్లాపురం నుండి వచ్చిన ఒక రైతును ” ఏం పెద్ద మనిషి..!
ఈ వయసు లో ఇంత దూరం వచ్చావ్. నువ్వు కూడా శుభాకాంక్షలు చెప్పాలా..?” అని అడిగితే..”ఏంది సార్ అట్టంటావ్..? శిల్పన్న మా ఊరి పంటలు కాపాడేందుకు 25 లక్షలు దాకా ఖర్చు పెట్టాడు.
అంత మనసున్న మారాజు కు ఈ కొత్త ఏడాది లో మంచి జరగాలి అన్నదే నా అభిమతం…
ఆయన కోసo ఎంత దూరం అయినా వస్తా ” అన్నాడు ఆప్యాయంగా..
ఇలా చెప్పుకుంటూ పొతే ఈ రోజంతా ఇలాంటి ముచ్చట్లే..ఇందరి అభిమాన పాత్రుడు అయిన శిల్పన్న కే కాదు.. శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు