సిద్దాపురం చెరువుకు ముప్పు

siddapuram-cheruvu-scaled.jpg

ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో… సిద్దాపురం చెరువు కట్టకు పొంచి ఉన్న భారీ ప్రమాదం..

సిద్దాపురం చెరువు కట్ట పెద్ద తూము దగ్గర సెట్టరుకు ఉన్న రాడ్డు విరిగి నీళ్లు వృధా..

నీట మునిగిన పంటలు..

భయాందోళనలో.. సిద్దాపురం , పెద్ద ఆనంతపురం , సిద్దేపల్లె , ముష్టెపల్లె గ్రామాల ప్రజలు , రైతులు

జిల్లా కలెక్టర్ కు తెలుగు గంగ ఈ ఈ కి.. చరవాణి ద్వారా సమాచారం అందించిన స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి..

అధికారులు వైసీపీ నాయకులు గురువారం 15-12-2022 నాడు రాత్రంతా ఇసుక సంచులు తూములో వేసినా నీటిలో కొట్టుకపోయాయే తప్ప.. నీటి ప్రవాహాన్ని ఆపలేక పోయారు

మెట్ట భూములను తడి భూములుగా సాగు చేసి రైతన్నల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు పాటుపడుతుంటే ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ఏకంగా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువుకట్టపై పెద్ద తూము దగ్గర భారీ స్థాయిలో ప్రమాదం పొంచి ఉందని ఆ ప్రాంత రైతులు గ్రామీణ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు . సాగునీరు అవసరాల కోసం షట్టర్ తూముకు రాడ్డు విరిగి నీళ్లలో పడిపోవడంతో నీరు మొత్తం వృధాగా పారిపోతుంది. దాదాపు మూడు గంటల పాటు ఈ సంఘటన జరిగిన అటువైపు ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి చూడలేదు సంవత్సరం గడవకముందే మళ్లీ అదే ప్రమాదం చోటుచేసుకుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతు సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలు రైతే రారాజు అంటూ ముందుకెళ్తున్న వైసీపీ ఆశయానికి ఇరిగేషన్ అధికారులు తూట్లు పడుతున్నారని చెప్పవచ్చు సిద్దాపురం చెరువు సాగునీటితో దాదాపు 22 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది అయితే గత ప్రభుత్వంలో 2018 జనవరి మాసంలో ఈ చెరువును జాతికే అంకితం చేశారు వర్షాలు పడినప్పుడు ఎన్ని అడుగులు వచ్చింది అనే విషయం తప్ప మరి ఏదీ ఉండదు మొత్తం జంగిలి ముళ్లపదలతో చెరువు కట్ట వెంట పిచ్చి మొక్కలే అధికంగా దర్శనమిస్తున్నాయి రైతన్నలు ఇప్పుడిప్పుడే రబీ సీజన్లో సాగు చేసుకున్న మినుము మొక్కజొన్న మెరుప మరియు ఇతర పంటలు నీటిలో మునిగి పరిస్థితి అస్తవ్యస్తంగా నిలిచిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరంలో ఇదే డిసెంబర్ నెలలో ఓ పెద్ద సమస్య జరిగిన విషయం రాష్ట్ర స్థాయి వరకు చేరింది మళ్లీ ఇదే డిసెంబర్ మాసంలో మరో పెద్ద సమస్య తల ఎత్తిందని రైతులు చెబుతున్నారు బిక్కుబిక్కుమంటూ పంట పొలాలలో రైతులు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు భయాందోళన చెందుతున్నారని చెబుతున్నారు సిద్దాపురం చెరువు కట్ట ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉందని ఆ చుట్టుపక్కల గ్రామాలైన , సిద్దాపురం , పెద్ద ఆనంతపురం , సిద్దేపల్లె , ముష్టెపల్లె గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

పెద్ద తుమ్ దగ్గర జరిగిన సంఘటనపై వెంటనే స్పందించిన సర్పంచ్ తనయుడు శివ నాయక్

నిండుకుండల కృష్ణా జలాలతో కళకళలాడుతున్న సిద్దాపురం చెరువు కట్ట పై పెద్దతుమ్ దగ్గర జరిగిన సంఘటన పై వెంటనే చెరువు కట్టకు సమీపంలో ఉన్న సంజీవనగర్ తండాకు చెందిన గ్రామ సర్పంచ్ నాగుల నాయక్ తనయుడు వైసీపీ యువ నాయకులు శివశంకర్ నాయక్ తక్షణమే స్పందించి రైతులతో చెరువు కట్ట దగ్గరికి వెళ్లి వరిగడ్డితో నీటి ప్రవాహాన్ని ఆపే చర్యలు చేపట్టారు ఒకవైపు అధికారులకు మరోవైపు ప్రజాప్రతినిధులకు ఎక్కడ జరుగుతున్న విషయాలను తెలుపుతూ తనకున్న నాయకత్వ లక్షణాలు రైతు బిడ్డగా ముందుకెళ్లారు ప్రాణాలతో సాహసం చేసేవారు కొందరు నాయకులే ఉంటారు అందులో శివ శంకర్ నాయక్ ఒకరని చెప్పవచ్చు ఏ సంఘటన జరిగినా తక్షణమే అధికారులకు చేరేవేసే విధంగా ముందుంటూ గ్రామాభివృద్ధిలో దూసుకెళ్తున్నారు

నంద్యాల జిల్లా కలెక్టర్ , తెలుగు గంగ ఈ ఈల తో చరవాణి ద్వారా సమాచారం తెలిపిన స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

రైతులకు ఆపద్బాంధవుడిలా అండగా ఉండి నిరంతరం రైతు శ్రేయస్సు కోసమే పాటుపడుతున్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గురువారం సిద్దాపురం చెరువు కట్ట పై పెద్ద తూమ్ దగ్గర షట్టర్ కు ఉన్న రాడ్డు విరిగి నీటిలోనే పడిపోయిన విషయం ఆత్మకూరు పాత్రికేయుడు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పట్టణంలో గడపగడప వైసీపీ కార్యక్రమం కొనసాగిస్తున్న నేపథ్యంలో వెంటనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ కు తెలుగు గంగ ఈ ఈ కి చరవారిని ద్వారా సమాచారం చేరవేసి ఆ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు నీట మునిగిన పంటలను ఫోటోలను చూసి చలించిపోయాడు అధికారులు నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోక తప్పదని స్థానిక ఎమ్మెల్యే అధికారులకు ఘాటుగా హెచ్చరించారు గ్రామీణ ప్రాంత రైతులు ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు సిద్దాపురం చెరువు కట్ట పై జరుగుతున్న సంఘటనపై ఇరిగేషన్ అధికారులు ప్రజా ప్రతినిధులు శాశ్వత పరిష్కారం చూపిస్తారా. వదిలేస్తారా. అనే విషయాన్ని గ్రామీణ ప్రాంతరైతులు ప్రజలు వేచి చూద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top