రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు – MLA శిల్పారవిరెడ్డి

Services-to-people-beyond-politics-MLA-Shilpa-Ravi-reddy.jpg

రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలందించేందుకు పోటీపడదామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి

శిల్పా కుటుంబం గత 25 సంవత్సరాలుగా నిరంతరాయంగా నంద్యాలలో శిల్పాసేవాసమితిని ప్రారంభించి పలు సేవాకార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా శిల్పా సహకార్, శిల్పా మహిళా సహకార్ బ్యాంక్, శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్స్, శిల్పా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, శిల్పా రైతు సహకార్, బసెషెల్టర్స్ వంటి అనేక సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో శిల్పా మహిళా బ్యాంక్ ఆద్వర్యంలో పేదింటి మహిళల ఆర్థిక స్వావలంభనకు, సాధికారతకు చేయూత అందిస్తూ అతితక్కువ వడ్డీలతో రుణాలను అందజేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా శిల్పా మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగినిరవిసింగారెడ్డి ఆధ్వర్యంలో 211 మంది
మహిళలకు29.87 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలందించేందుకు పోటీపడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నంద్యాల ప్రజలకు సేవలు అందించాలన్న సంకల్పంతో మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి శిల్పా సేవాసమితిని గత 26 సంవత్సరాల క్రితం ప్రారంభించి నేటి వరకు నిరంతరాయంగా సేవలను అందిస్తున్నామన్నారు. తాము చేస్తున్న సేవాకార్యక్రమాలపై విమర్శలు చేస్తున్నవారు రాజకీయాలకు అతీతంగా సేవాకార్యక్రమాలను ప్రజలకు అందించేవాటిలో పోటీపడాలని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కష్టకాలంలో తాను నంద్యాల నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచానని, పట్టణంలో ప్రజలకు 50లక్షల విలువగల కూరగాయలను, పండ్లను,
శానిటైజర్లు, మాస్క్లు, పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ
నిరంతరం ప్రజలతో ఉన్నామన్నారు. తమపై రాజకీయ బురదజల్లుతూ అసత్య
ప్రచారాలు చేస్తున్న టీడీపీ నాయకులు కరోనా కాలంలో ఎక్కడ దాక్కున్నారో
ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజల కష్టాలలో ఉన్నామని, ఎవరైనా కష్టాలలో ఆదుకున్న
వారిని ఎన్నటికీ మరచిపోరాదని, కష్టాలలో కనిపించని వారు ఈ ఎన్నికల
సందర్భంగా ప్రజల్లో తిరుగుతూ కల్లబొల్లిమాటలు చెబుతూ మోసగించేందుకు
వస్తున్నారని అట్టివారిని నమ్మవద్దని తెలిపారు. కష్టంలో గుర్తుకు రాని వారికి ఓట్లకు
మాత్రం గుర్తుకు ఎలావస్తారో ప్రజలు గమనించాలన్నారు. కష్టాల్లో సహాయం
చేసిన వారిని మాత్రమే నమ్మాలని కోరారు. కరోనా కష్టాలలో సైతం వైఎస్సార్సీపీ
ప్రభుత్వం ఇచ్చిన హామీలను, పథకాలను ప్రజలకు అందించి ఆదుకోవడం జరిగిందన్నారు. ఇదే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో అప్పులు
చేసిందని, అయితే ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు ఇవ్వలేదని తెలిపారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు ఉన్నా అన్ని పథకాలను ప్రజలకు అందించిన ఘనత తమదన్నారు. టీడీపీ హయాంలో చేసిన అప్పులు ప్రజలకు కాకుండా
వారి జేబుల్లోకి వెళ్లాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5
సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా కాలంలో గడిచిపోయాయని, కేవలం
3సంవత్సరాలలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అందించామన్నారు. నంద్యాలలో

అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, రానున్న కాలంలో తిరిగి వైసీపీ
ప్రభుత్వ అధికారంలోకి వస్తుందని, మరింత అభివృద్ధి చేసిచూపెడతామని
పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ,
మేనేజర్ హరిలీల, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top