జిల్లాలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి..
AP: అనంతపురం జిల్లాలో గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్యను పెంచాలని అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా అనంతపురం జిల్లా బీసీ గురుకుల కన్వీనర్ గా
విధులు నిర్వహిస్తున్న సంగీత కుమారిని తొలగించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బీసీ గురుకుల పాఠశాల రాష్ట్ర సెక్రటరీ కృష్ణమోహన్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు కుల్లాయి స్వామి మాట్లాడుతూ అనంతపురం జిల్లా కరువు జిల్లాను
దృష్టిలో ఉంచుకొని అడికారులు గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్యను పెంచాలని తెలిపారు.
దేశంలోనే అత్యంత కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాలో పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పనుల కోసం పక్క రాష్ట్రాలకు వలసలకు వెళుతు
తమ పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలనే ఆశయంతో వేలాదిమంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్ల కోసం అప్లై చేసిన వారు చాలామంది ఉన్నారు
అప్లై చేయని వారు కూడా కొన్ని వేల మంది ఉన్నారు. అనంతపురం జిల్లాలో కేవలం బిసి గురుకులలో 800 సీట్లు మాత్రమే ఉండడంతో చాలామంది విద్యార్థులకు సీట్లు అందక
ఇబ్బందులకు గురవుతున్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు సమస్యలు దృష్టిలో ఉంచుకొని గురుకుల పాఠశాలలో
సీట్లు సంఖ్యను పెంచి జిల్లాలో ఇంకా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు.
జిల్లాలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి..
అదేవిధంగా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరారు.పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం
తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా జిల్లాలో రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు కొంతమంది గురుకుల పాఠశాలలో
విద్యార్థులకు సీట్లు కేటాయిస్తుండడంతో పరీక్ష రాసి అర్హత పొందినటువంటి వారు సీట్లు రాక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
అదేవిధంగా జిల్లాలో గత 15 సంవత్సరాలుగా బీసీ గురుకుల కన్వీనర్ గా విధులు నిర్వహిస్తున్న సంగీత కుమారిని బీసీ గురుకుల కన్వీనర్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కన్వీనర్ గా సంగీత కుమారిని తొలగించాలి
ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నటువంటి వారు మామూలుగా మూడు లేదా ఐదు సంవత్సరాలు ఉంటూ మరొక చోటకి ట్రాన్స్ఫర్ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు
కానీ 15 సంవత్సరాలుగా బీసీ గురుకుల కన్వీనర్ గా కొనసాగుతున్న గతంలో సంగీత కుమారి పైన రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీ కూడా వేయడం జరిగిందని తెలిపారు..
పేద మధ్య తరగతి విద్యార్థులకు గురుకులాల్లో సీట్లు కేటాయించాలి
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అనంతపురం జిల్లాలో గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్యను పెంచి నియోజకవర్గం కేంద్రాలలో లేనిచోట గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధనుంజయ ప్రతాప్ నాయకులు ఏరిస్వామి తదితరులు పాల్గొన్నారు.