సప్తనదుల సంగమేశ్వరం విశేషాలు ..
ఉత్తర భారతదేశంలోని అమరనాథ్,బద్రినాథ్,కేదారం నాథ్ యాత్ర గురించి అందరు వినే ఉంటారు. కొన్ని కాలాలు మాత్రమే ఇక్కడ పరమేశ్వరుడు దర్శమిస్తూ ఉంటాడు.
కాని దక్షిణ భారతదేశంలో అదీ మన అంధ్ర ప్రదేశ్ కూడా అటువంటి క్షైవ క్షేత్రం ఉందని కొంతమందికే తెలుసు సప్తనదులు సంగమించే చోటా…
ఎనిమిది నెలలు నీటిలో నివాసముండి నాలుగు నెలల పాటు మాత్రమే భక్తులకు పరమేశ్వరుడు దర్శనమిచ్చే అటువంటి అపురూపమైన క్షైవ క్షేత్రం సంగమేశ్వరం.
పాలకులు దేవాదాయ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఏటికేడు సిధిలమైపోతూ అవశేషంగా మిగులుతున్న కర్నూలు జిల్లా సంగమేశ్వరంపై politicalhunter.com ప్రత్యేక కథనం.

భారత దేశంలో అన్ని పుణ్యక్షేత్రాలకు తలమానికం శ్రీ సప్తనది సంగమేశ్వరం ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా పాండవుల ఈ దేవాలయాన్ని నిర్మించారని ప్రసిద్ధి..
సప్తనది సంగమేశ్వరంలో స్నానం మాచరించి శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్లను దర్శించాలని మహాభారత ప్రస్తావన.
ఐతే ఇదంతా పూర్వ వైభవమే శ్రీశైలం డ్యాం కట్టడం వల్ల ఈ పవిత్ర పుణ్యక్షేత్రం కృష్ణా నదిలో కలిసి పోయింది ఎనిమిది నెలలు నీటిలో ఉండి నాలుగు నెలలు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటుంది.
కృష్ణా నదిలో.. ఈ ఆలయం
చెట్ల కొమ్మలపై నెలకొన్న కోయిలను చూసివుంటారు అరణ్యాలలో నెలవైన ఆలయాలను చూసివుంటారు మరి నదిలో నెలవైన ఆలయాన్ని మీరెప్పుడైనా చూశారా..
అటువంటి పుణ్యక్షేత్రం చూడాలంటే మీరు సంగమేశ్వరం రావాల్సందే. కేవలం దర్శనం ద్వారానే సర్వ పాపాలను నివృత్తి చేసే పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందిన నివృత్తి సంగమేశ్వరం.
కర్నూలు జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లె మండలంలో కొలువై ఉంది. ఈ క్షేత్రంలో పరమశివుడు సంగమేశ్వరునిగా కొలువై పూజలందుకుంటున్నడు స్కంధ పురాణంలో ప్రస్థావించబడిన ఈ క్షేత్రం సప్తనది సంగమంగా పేరు పొందింది.
మహారాష్ట్ర లోని పచ్చిమ కనుమలలో పుట్టిన కృష్ణా నది సముద్రంలో కలిసేంతవరకు 30కి పైగా సంగమాలున్నాయి.
కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహరిణి, భీమరధి, ఈ ఆరు నదులు కలిసి ఇక్కడి భవనాశి నదిలో కలుస్తుండటం వలన ఈ క్షేత్రం సప్తనది సంగమం అయింది.
ప్రతీ సంవత్సరం జూన్ లేదా ఆగస్టు నెలలో నీట మునిగి మార్చి నెలలో బయట పడటం ఈ క్షేత్రం ప్రత్యేకత సంవత్సరంలో ఎనిమిది నెలలు గంగమ్మతో గడిపి,
నాలుగు నెలలు పార్వతి సమేతంగా భక్తుల కోరికలు తీర్చే ఈ సంగమేశ్వరున్ని చర్చించుకోవడానికి మనరాష్ట్రం నలుమూలల నుండే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు.

పాండవులు నిర్మించిన అలయమే సంగమేశ్వరం..
పురాణాల ప్రకారం ద్వాపరయుగంలో పాండవుల అరణ్యవాస సమయంలో ప్రాంతానికి వచ్చారట నదీ ప్రాంతం కావటంతో ఇక్కడ శివ లింగం ప్రతిష్టించాలని ధర్మరాజు బావించాడు.
అందుకు కాశీకి వెళ్లి శివ లింగాలను తీసుక రావాల్సిందిగా భీమశేనుడికి ధర్మరాజు ఆజ్ఞాపించాడు ఐతే కాశీకి వెళ్లిన భీమషేనుడు తిరిగి రావడానికి ఆలస్యం కావడంతో..
వేపదారు శివలింగం
ముహూర్త సమయం దాటి పోతుందని భావించి పురోహితుల సలహాతో పక్కనే వున్న వేప చెట్టును నరికి వేప మొద్దును శివ లింగంగా ప్రతిష్ఠించారు.
భీమ లింగంగా పేరు ఎలా వచ్చింది..
తాను కాశీకి వెళ్లి శివలింగాలను తీసుకొచ్చేసరికి వేప మొద్దును ఇక్కడ ప్రతిష్టండాన్ని చూసిన భీమషేనుడు ఆగ్రహించి కాశీ నుంచి తీసుకొచ్చిన..
ఐదు శివ లింగాలను దూరంగా విసిరేశాడట అవే నేడు సోమేశ్వరం,సిద్ధేశ్వరం,మల్లేశ్వరం,కపిలేశ్వరం, సంగమేశ్వరంగా రూపొందాయని స్థల పురాణం చెప్తోంది.
Also Read శ్రీ కొలనుభారతి సరస్వతీ దేవి ఆలయ విశిస్టత
ధర్మరాజు భీమున్ని శాంతింపజేసి నదీ తీరంలోనే భీముడు తెచ్చిన లింగాన్ని ప్రతిష్టంచి భీమ లింగంగా దానికి పేరుపెట్టి భక్తులు ముందుగా..
భీమేశ్వరున్ని దర్శించిన తర్వాతే సంగామేశ్వ స్వామిని దర్శించే ఏర్పాటు గావించినట్టు స్థల పురాణం చెబుతుంది.
అప్పటి నుంచి భీమ లింగాన్ని పూజించిన తర్వాతే భక్తులు ఆలయంలోని వేపమొద్దు శివ లింగానికి పూజలు చేస్తారు.
ఈ క్షేత్రంలో శాండిల్యముని తపస్సు చేసి సూర్యున్నిప్రసన్నం చేసుకోవడంతో ఈ క్షేత్రానికి నివృత్తి భాస్కర క్షేత్రం అనికూడా పేరుంది.
ఏడు నదులు ఒకే చోట కలిసే చోటు ఈ సంగమేశ్వరం..
కర్నూలు జిల్లా ఆత్మకూరుకు దగ్గలో ఉన్న ఈ క్షేత్రానికి నివృత్తి సంగమేశ్వరం అని పేరు కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహరిణి, భీమరధి, భవనాశిని అనే ఎడు నదులు ఈ క్షేత్ర నాధుడైన సంగామేస్వరున్ని సేవించు కోవడానికి ఇక్కడికి చేరాయట
గ్రహణం రోజున సప్తసాగరాలు అన్నితీర్తాలు ఇక్కడికి చేరుతాయని అప్పుడు ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే సర్వ సాగర శ్నాన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. సప్తనది సంగామేస్వరానికి పురాణాల్లో ఓ ఘాద ప్రచారంలో ఉంది , పూర్వం గంగా దేవి తన పాప ప్రక్షాళన కోసం నల్లని వికృత కాకి రూపంలో.. ఇక్కడికొచ్చి ఇక్కడ స్నానం చేసి తెల్లటి హంసగా మారి తిరిగి కాశికి వెళ్లి పోయేదట.
పూర్వం ఈ ప్రాంతంలోనే ధక్ష యగ్నం జరిగిందని.. చెబుతున్న పురాణాలు..
సంగమేశ్వరం అని కూడా పేరు 11 తీర్థాలు కొలుతీరి వుండటం సంగమేశ్వరుడి మరో విశిష్టత 330 సంవత్సరాల కిందట ఉత్తరాది మటం పీఠాధిపతులు నివాసం ఏర్పరుచుకున్నారట మరో కథనం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలోనే ధక్ష యగ్నం జరిగిందని ..
ఆయగ్న సమయంలో తండ్రి ధక్షుడి చేత అవమానించబడిన సతీదేవి ఇక్కడే యగ్నవాటికలో మరణించిందని కథనం సతీదేవి శరీరం నివృత్తి జరిగిన స్థలం గనుక క్షేత్రానికి నివృత్తి సంగమేశ్వరం అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తోంది అగస్యుడు కపిల మహర్షి కూడా ఇక్కడ యగ్నం చేశారని స్థల పురాణాలు చెబుతున్నాయి.
ప్రకృతి రమణీయతను తలపించే క్షేత్రం
ఎత్తైన కొండల మధ్య కృష్ణానది ఓ సముద్రాన్ని తలపిస్తోంది సంగమేశ్వరం తీరంలో కొలువుతీరి వున్న ప్రకృతి రమణీయతను చూసి ఇక్కడికి వచ్చే భక్తులు పరవసించి పోతూవుంటారు భక్తుల హృదయాల్లో శతాబ్దాల పాటు పూజలందుకుంటున్న సంగమేశ్వరుడికి 20వ శతాబ్ది చివరిలో కష్టలోచ్చి పడ్డాయి.
శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణంతో
శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణంతో కృష్ణా నది బ్యాక్ వాటర్ లో ఎదేవాలయం ముంపునకు గురైంది. ప్రతి సంవత్సరం శ్రీశైలం డ్యాం కు 838 అడుగులు వచ్చేసరికి గుడిలోకి నీరు చేరుతాయి 875 అడుగులకు గుడి మొత్తం నీట మునుగుతుంది. నీటిమట్టం తగ్గగానే మార్చినెలలో బయట పడుతుంది. ఈఆలయం బయట పడగానే 12 సెం.మీ, మేరా బురద పెరుకపోతోంది. ఆలయ పూజారి తెల్కపల్లి రఘురామ శర్మ చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో ఆలయాన్ని శుబ్రంచేసి పూజలు చేస్తారు
చరిత్రకు అద్దం పడుతున్న శాసనాల..
సంగమేశ్వరంలో లభించిన శాసనాలు ఈ క్షేత్ర చరిత్రకు అద్దం పడుతున్నాయి ఈ శాసనాల ప్రకారం కీ,శ. 8 ,9,శతాబ్దాల నాటికే ఈ ఆలయం నిర్మింపబడి పూజలు అందుకుంటున్నట్లు తెలుస్తుంది అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వివిధ వంశాల పాలకులు విజయ నగర చక్రవర్తుల ఆలయ అభివృద్దికి విశేషంగా కృషి చేశారు ఐతే ఒకప్పుడు గొప్పగా వెలుగొందిన ఈ ఆలయం క్రమంగా శిధిలమైపొగా ప్రస్తుతం గత వైభవానికి సంభందిచిన అవశేషాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.
పూర్వం ఆలయ ముఖ మండపం అంతరాలయం ఘర్భాలయం కలిగి ఉండేవి ఇప్పుడు ముఖ మండపం పూర్తిగా శిదిలమైపోగా గర్బాలయం మాత్రమే దర్శనమిస్తున్నాయి ఘర్భాలయంలో శ్రీ సంగమేశ్వర స్వామి కొలువుతీరి పూజలందుకుంటున్నాడు ఈ శివలింగం వేప మోద్దులాగాఉంటుంది అంటే వేపమొద్దు కాలక్రమేనా శివలింగంగా మారిందని ప్రసిద్ది.
Also Read Sony Bravia 164 cm (65 inches) 4K Ultra HD Smart LED Google TV KD-65X74L
ఘర్భాలయం లో స్వామి వారి వెనక వైపున స్వామివారి త్రివేరి శ్రీ లలితాదేవి చతుర్బుజాలతో పద్మాసన స్తితిలో కొలువు తిరివుంది.అమ్మవారికి ముందువైపు శ్రిచంక్రం ప్రతిష్టించబడి ఉంది ప్రధాన ఘర్భాలయంలోనే స్వామివారి వెనకవైపు కుడి ప్రక్కగా శ్రీ వినాయకుడు కొలువుతీరి పుజలందుకుంటూ ఉన్నారు ఈ విగ్రహాలకంతా దేవాలయాలు ఉండేవి ఈ ఆలయాలు శిదిలమైపోగా దేవతా మూర్తులను ప్రధాన ఘర్భాలయంలోకి చేర్చారు.
శిధిలాల మద్య సంవచ్చరంలో ఎక్కువకాలం మునిగిపోయి ఉండడంతో పురావస్తుశాఖ వారుకాని దేవాదాయశాఖ వారుకాని పట్టించుకోక పోవడంతో ఆదరణకు దూరమై గతవైభవ శిధిల చింహ్నంగా దర్శన మిస్తోంది అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువకాలం శ్రీశైలం ప్రాజెక్ట్ లో మునిగి ఉండటమే ఇందుకు కారణం.

#సంగమేశ్వరం #sangammeswaram #saptanadhulasangameswaram #ధరమరాజు ప్రతిష్టించిన శివ లింగం #పాండవులు నిర్మించిన దేవాలయం సప్తనది సంగమేశ్వరం @politicalhunter