కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు

Saptanadula-Sangameswaram-Temple.jpg

నంద్యాల జిల్లా,నందికొట్కూరు నియోజకవర్గం,కొత్తపల్లె మండలం, సప్తనదుల సంగమేశ్వర ఆలయం

తుంగ,భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అనే సప్తనదుల సంగమంలో వెలసిన ఆలయం సంగమేశ్వర ఆలయం.. ఏడాదిలో దాదాపు 8 నెలల పాటు నీటిలో ఉండే ఈ సంగమేశ్వర ఆలయం శ్రీశైలం రిజర్వాయర్ లో నీటిమట్టం తగ్గుతూ ఉండటంతో జలావాసము నుంచి సప్త నదుల సంగమేశ్వర స్వామి కొంచెం కొంచెం బయటపడుతూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు.

సంగమేశ్వరుడిని తాకిన కృష్ణాజలాలు

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమేపీ తగ్గుతుండటంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ ప్రాంతం లోని సంగమేశ్వరుడు నెమ్మదిగా జలాధివాసం వీడుతున్నాడు. ప్రస్తుతం కృష్ణాజలాలు సంగమే శ్వర ఆలయ ప్రహరీ దగ్గరగా వచ్చాయి. కేవలం 10 అడుగుల నీటిమట్టం తగ్గితే ఆలయం పూర్తిగా బయటపడి సంగమేశ్వరుడు భక్తులచే పూజలు అందుకోనున్నాడు. తీవ్ర వర్షభావ దృష్ట్యా , ఉన్న కృష్ణానది జిలాలను రెండు తెలుగు రాష్ట్రాలు విరివిగా వినియోగిస్తుండడంతో శ్రీశైల జలాశయంలో రోజు అడుగు మేర నీటిమట్టం తగ్గుతుంది.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటిమట్టం 850 అడుగులకు చేరుకుంది.. మరో 10 అడుగులు తగ్గితే విజయదశమికి (దసరా)సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాధివాసం నుండి బయటకు వస్తుంది.. ఈ సంవత్సరం నాలుగు నెలల ముందు భక్తులకు సంగమేశ్వరుడు దర్శనము ఇవ్వనున్నాడని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు.

8 సంవత్సరాల తర్వాత కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరం

గతంలో 2015 సంవత్సరంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని మళ్లీ 8 సంవత్సరాల తర్వాత సంగమేశ్వర ఆలయం నాలుగు నెలలు ముందుగా ఆ భక్తులకు దర్శనమిస్తుందని ఆలయ పురోహితులు తెలియజేశారు ప్రతి సంవత్సరం సంగమేశ్వరాలయం ఆగస్టు నెలలో కృష్ణమ్మ ఒడిలోకి చేరుకొని ఫిబ్రవరి చివర్లో భక్తులకు దర్శనం ఇచ్చేది.. కానీ ఈ సంవత్సరం ఆగస్టులో కృష్ణమ్మ ఒడిలోకి చేరుకొని అక్టోబర్ నెలలోనే బయట పడనుంది.

 Read this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top