కుటుంబ సమేతంగా శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని దర్శించుకున్న రోడ్ల భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి…
శ్రీ ఉమామహేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు..

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దర్శించుకోవడం జరిగింది. ముందుగా బీసీ జనార్దన్ రెడ్డి అక్కడికి చేరుకోగానే ఆలయ ఈవో ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి అభిషేకం పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు బసవన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు సన్మానించడం జరిగింది.
