విశేషాల సంగమం సంగమేశ్వర క్షేత్రం
రిపోర్టర్:—- కె. శ్రీనివాసులు 94418 40249
AP ; సప్త నదుల సంఘమం వద్ద వెలసిన సంగమేశ్వర క్షేత్రం ఎన్నో విశేషాలతో కూడినది… భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విచిత్ర సంఘటనలు, ప్రత్యేక పరిస్థితులు ఈ క్షేత్రానికి ఉంది..
ఇక్కడ వెలసిన శివాలయం నాలుగు నెలలపాటు భక్తులకు దర్శనం ఇచ్చి, ఎనిమిది నెలలు పూర్తిగా నీటిలోనే మునిగిపోయి ఉండడం విశేషం.
బహుశా దక్షిణ భారతదేశంలో ఇలాంటి శివాలయం ఎక్కడ ఉండి ఉండదు.. ఉత్తర భారతదేశంలో మంచుతో కప్పబడ్డ శివాలయాలను మనం విని ఉంటాం.
కొందరు చూసి ఉంటారు.. కానీ కృష్ణా నది ది నీటిలో ఎనిమిది నెలలు పూర్తిగా మునిగిపోయి, కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ఉన్న ఏకైక శివాలయం సంగమేశ్వర క్షేత్రం..
క్షేత్ర విశేషాలు
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో ఈ సంగమేశ్వర క్షేత్రం ఉంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర ,మలాపహరిణి, భీమరథి భవనాసి లు ఒక్కటిగా కలిసే ప్రాంతం ఇది.
ఈ ఏడు నదులు కలిసేచోట దక్షయజ్ఞం జరిగిందని, సతీదేవి తన శరీర నివృత్తి చేసిన స్థలం ఇదేనని, అందుకే ఈ క్షేత్రానికి నివృత్తి సంగమేశ్వర క్షేత్రం అని అంటారని, స్కాందపురాణంలో వుంది…
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
సప్త నది సంగమ క్షేత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ధర్మరాజు వనవాస సమయంలో ప్రతిష్టించిన వేప దారు శివలింగం ఇక్కడ ప్రముఖంగా పూజలందు కుంటుంది.
భీముడు ప్రతిష్టించిన భీమ లింగం. విశ్వామిత్రుడి గృహాలు, విశ్వామిత్రుడు తపస్సుకు మెచ్చి గోపాలగిట్ట రూపంలో దర్శనమిచ్చిన గాయత్రి దేవి పాదముద్రికలు.
ద్రౌపతి దేవి క్షేత్ర సందర్శన సమయంలో పాయసం వండిన ప్రదేశాలు, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి. క్షేత్ర ఆవరణంలో రుద్రాక్ష మండలం ఉంది.
విజయనగరం సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు ఇక్కడికి రెండు పర్యాయాలు సందర్శించినట్లు చెబుతారు.
ఆ సమయంలో దేవుడి పేర మాన్యం భూములు ప్రకటించి శిలా శాసనాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.
మహా చక్రవర్తి శివాజీ మహారాజ్ కూడా సంగమేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన తర్వాతే శ్రీశైలం భ్రమరాంబ దేవి అనుగ్రహాన్ని పొందినట్లు చెబుతారు….
శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత 1980లో సప్తనదీ సంగమేశ్వరం కృష్ణమ్మ గర్భంలోకి చేరుకుంది. అప్పటి నుంచి 24 సంవత్సరాలపాటు జలాధివాసం ఆయన సంగమేశ్వరం 2000లో బయట పడి భక్తులచే పూజలందుకుంటున్నాడు.
అయితే నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తూ ఎనిమిది నెలలు జలాధివాసం లోనే ఉంటాడు.18 సంవత్సరాలలో లో మహా శివరాత్రి పర్వదినానికి 12 సార్లు భక్తులకు దర్శనమివ్వడం విశేషం.
అయితే ప్రస్తుతం సంగమేశ్వర క్షేత్రంలోని శివాలయం పూర్తిగా జలాధివాసంలో ఉండడం వల్ల సప్తనది జలాలలో భక్తులు స్నానం ఆచరించి గట్టు పైన వెలసియున్న ఉమామహేశ్వర ఆలయంలో పూజలు నిర్వహిస్తారు..
పౌరాణిక నేపథ్యం
సంగమేశ్వర క్షేత్రంలోని వేప దారు శివలింగాన్ని ద్వాపర యుగంలో ధర్మరాజు ప్రతిష్టించారని పురాణాలలో ఉంది…
పాండవులు తన సోదరులతో సంగమేశ్వరంలో విడిది చేసిన ధర్మరాజు తన స్వహస్తాలతో శివలింగాన్ని ప్రతిష్టించాలని భావించారని,
అందుకు కాశీకి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని భీమసేనునికి పంపించారని చెబుతారు. అయితే ముహూర్త సమయానికి భీముడు…
సంగమేశ్వర క్షేత్రానికి చేరుకోలేకపోయారని దీంతో కృష్ణ పరమాత్ముని సూచన మేరకు ధర్మరాజు పశ్చిమ దిశలో ఉన్న భారీ వేపచెట్టు ను…
ఖండించి మొదలును ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాల నాటినుంచి వేపదారు శివలింగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా భక్తులచే పూజలందుకుంటోంది..
ప్రస్తుతం శ్రీశైలం జలాశయం లో భారీ నీటి నిల్వలు ఉన్న కారణంగా సంగమేశ్వర క్షేత్రం జలాధివాసం అయింది. భక్తులు ఎగువ గట్టున వున్న ఉమామహేశ్వర ఆలయంలో పూజలు చేస్తున్నారు..
కార్తీకమాసంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిల దర్శనానికి భక్తులు పోటెత్తారు. అయితే శ్రీ గిరి కి వెళ్లేముందు సప్తనది సంగమేశ్వరుని సందర్శించాలని పండితులు సూచిస్తుంటారు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector