పోలీస్ శాఖలో ఫ్యాక్షన్ జోన్ తీసివేయాలని సీనియర్ జర్నలిస్ట్ కాశీపురం ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాయలసీమలో ఎప్పుడో 80, 90 దశకాల్లో ముఠా తగాదాలు ఉండేవి. వాటికి పోలీస్ శాఖ ఫ్యాక్షన్ అనీ, ఫ్యాక్షనిస్టులు అనీ ముద్దు పేరు పెట్టారు. ఈ పేరు ఇప్పుడు మా పాలిట శాపం గా మారింది. ఫ్యాక్షనిస్టులు అనే పదం వాడడం ఒకరకమైన రాక్షసత్వం. ఇది మా ప్రాంతం పై జరుగుతోన్న సాంస్కృతిక దాడి..ఇది ఖచ్చితంగా Cultural assassination.అని కాశీపురం ప్రభాకర్ రెడ్డి ఖండించారు.
మా ప్రాంతాన్ని బయట ప్రపంచం ఇప్పటికీ ఈ ఫ్యాక్షన్ అనే దృక్కోణం లోనే చూస్తోంది. దయచేసి ఈ ధోరణి పోవాలి.రాయలసీమ లో ముఠా గొడవలు ఎక్కువగా ఉన్నప్పుడు 1994 లో అప్పటి ముఖ్యమంత్రి కీ శే NT రామారావు గారు కర్నూల్ హెడ్ క్వార్టర్ గా “ఫ్యాక్షన్ జోన్ ” అనే విభాగం పెట్టారు. దీనికి AK మొహంతి అనే IG ని ఇంచార్జి గా పెట్టి ఈ గొడవలు అణిచి వేసే ప్రయత్నం చేశారు. ఈ విభాగం లో పని చేసే సిబ్బంది కోసం ఒక హెడ్ కింద జీతాలు డ్రా చేసేవారు.
ఇప్పుడు మా రాయలసీమ లో ముఠా గొడవలు లేవు. పోలీస్ భాష లో చెప్పాలంటే ఫ్యాక్షన్ గొడవలు లేవు. ఫ్యాక్షనిస్టులు అసలే లేరు. సినిమా వాళ్ళు ఈ పేరుతో వికృత కథలు రాస్తే, మనో భావాలపై దాడి కింద క్రిమినల్ కేసులు పెట్టండి. ఫ్యాక్షన్ లేకపోయినా, ఇప్పుడు కూడా ఈ ఫ్యాక్షన్ జోన్ నడుపుతున్నారు. Almost లూప్ లైన్ విభాగం ఇది. ఫ్యాక్షన్ అనే నీచమైన నికృష్ట పదం ఉపయోగిస్తూ ఇంకా ఎన్నాళ్ళు మమ్మల్ని అవమానిస్తారు? నరరూప రాక్షసులుగానో , నర మాంస భక్షకులు గానో చిత్రించే ప్రయత్నంలో . మేమసలు మనుషులమే కానట్టు ఫ్యాక్షనిస్టులు అంటూ ఎన్నాళ్లీ తలవొంపులు..? ఇకనైనా దయచేసి రాయలసీమ ఫ్యాక్షన్ జోన్ లను తీసేయండి. పోలీస్ శాఖ లో మీ అధికారులను accommodate చేసుకోవడానికో లేదా లూప్ లైన్ లో ఉంచడానికో అయితే ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి. Pls pls remove Faction zone.