రహదార్లు, రైలు పట్టాల ప్రక్కన, బయలు ప్రదేశాలు, మెట్ట ప్రాంతాల్లోను విస్తారంగా సుమారు రెండు మీటర్ల ఎత్తు వరకు బహు వార్షికంగా తంగేడు. మొక్కలు పెరుగుతాయి. పత్రాలు కణుపునకు ఒకటి చొప్పున చింతాకుల్ని పోలీ కొద్దిగా పెద్దవిగా ఉంటాయి.
కొమ్మల చివర గుత్తులుగా విరబూసిన పసుపు పచ్చని పూలతో షీకాయ వంటి కాయల్ని కలిగి ఉంటాయి. బతుకమ్మ లను పేర్చటంలో ఈ పూలను ఉపయో గిస్తారు. సిస్సాల్పినేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయనామం ‘కేసియా ఆరిక్యులేట’ తంగేడు ఇగుర్లు లేదా ఆకుల్ని దంచి శిరస్సుపై పెట్టుకుని కట్టు కట్టుకుంటే శరీరంలోని అతి వేడిమి, తలనొప్పి, పోట్లు తగ్గుతాయి.
శ్రీ బాషండ్ గ ఎండించిన తంగేడు సమూల చూర్ణం, పంచదార సమంగా కలిపి ఒక స్పూను వంతున మూడు పూటలూ సేవిస్తుంటే అధిక మూత్రవిసర్జన తగ్గుతుంది.
తేలు కుట్టిన చోట తంగేడు ఆకుల్ని దంచి కట్టు కడితే నొప్పి తగ్గుతుందని గిరిజనులు ఆచరించే అనుభవవైద్యంగా చెబుతారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
అలాగే తంగేడు చిగుళ్ళని మజ్జిగతో నూరి పాదాలకు, మడిమలకు రాసి అదే ఆకుతో కప్పి కట్టు కట్టుకుంటుంటే కాళ్ళ పగుళ్ళు త్వరగా తగ్గిపోతాయని చెబుతారు.
20 మి.లీ. తంగేడాకు రసంలో ఆయుర్వేదౌషధ విక్రయశాలల్లో దొరికే శుద్ధ గంధకాన్ని 100 – 200మి.గ్రా కలుపుకుని ఉదయం, సాయంత్రం సేవిస్తూ చప్పిడి పథ్యం చేస్తే ఒళ్ళంతా దురదలు, కురుపులు మానిపోతాయి.
తంగేడు గుల్కందుగా పిలిచే ఈ ఔషధాన్ని ఉదయం, సాయంత్రం ఒకస్పూను వంతున సేవిస్తుంటే మూత్రంలో మంట, చురుకు అతివేడి తగ్గుతుంది.
విరిగిన ఎముకలు అతుక్కున్న తర్వాత ఇంకా నొప్పితో బాధపడేవారికి వారం పదిరోజుల పాటు రోజూ తంగేడాకుల్ని మెత్తగా దంచి పెరుగలో కలిపి ఆయా భాగాల్లో పట్టించి కట్టు కట్టి అప్పుడప్పుడు నీటితో తడుపుతుంటే ఆ నొప్పి తగ్గుతుంది.
4, 5 లేత తంగేడాకుల్ని నూరి పెరుగులో కలిపి రోజుకు రెండు మూడు సార్లు సేవిస్తుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.
ఎండించిన తంగేడు పట్ట, ఉత్తరేణి ఆకు, వేప బెరడు, మిరియాలు, ఎండిన నిమ్మ తొక్కలను పొడిగా చేసి ఒక్కొక్కటి 25 గ్రాములు, హారతి కర్పూరం పొడి 10 గ్రాములు కలిపి పళ్ళు తోముకుంటుంటే చిగుళ్ళనుంచి చీము, రక్తం కారటం చిగుళ్ళవాపు, మంటలు, పంటి నొప్పులు తగ్గుతాయి.
ఎండించిన తంగేడు పూల చూర్ణాన్ని నీళ్లలో వేసి కషాయం కాచి పాలు, పంచదార కలిపి కాఫీ లేదా టీ కి ప్రత్యామ్నాయంగా పుచ్చుకోవచ్చు.
కాఫీ, టీల వ్యసనపరులు దీన్ని సేవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో కొద్దిగా ధనియాలు, ఏలకుల పొడి కూడా కలిపి తీసుకుంటుంటే తల తిరగటం, గుండెదడ తగ్గుతాయి.
పావుకిలో తంగేడు పూలు, అరకిలో పంచదార, వందగ్రాముల తేనె తీసికోవాలి. మొదట ఒక వెడల్పాటి గాజు సీసాలో తగినన్ని తంగేడు పూలను ఒక పొరలా వేయాలి.
తంగేడు తో మధుమేహ వ్యాధి అదుపు
ఆ పొరపై పంచదారను పొరలా చల్లాలి. మరలా పంచదార పొరపై తంగేడు పూలను పొరలా వేయాలి. ఇలా ఒకదానిపై మరొకటి వేసి చివరగా తేనెను వేసి పది పదహైదు రోజులపాటు ఎండలో వుంచితే లేహ్యం తయారవుతుంది.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
తంగేడు గుల్కందుగా పిలిచే ఈ ఔషదాన్ని ఉదయం, సాయంత్రం ఒక స్పూను వంతున సేవిస్తుంటే మూత్రంలో మంట, చురుకు, అతివేడి తగ్గుతుంది.
తంగేడు పూలు లేదా ఆకుల్ని నల్లగా మాడ్చి ఆముదం లేదా కొబ్బరి నూనె కలిపి పట్టిస్తుంటే కాలిన పుళ్ళు, బొబ్బలు, మచ్చలు తగ్గిపోతాయి.
తంగేడు గింజల చూర్ణం ఒక స్పూను చొప్పున వేడి నీటిలో కలిపి తీసుకుంటున్నా, లేదా ఎండించిన తంగేడు పూమొగ్గలు, ఉసిరిక వలుపు, పసుపు .. చూర్ణాల్ని సమంగా కలిపి ఒక స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం అరకప్పు వేడి నీటితో సేవిస్తుంటే మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది.