ఎర్రచందనం సీజ్

Red sandalwood siege

Red sandalwood siege

  • ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ ( RSASTF )
  • ఆదవరం అటవీ పరిధిలో 6ఎర్రచందనం దుంగలు స్వాధీనం
  • ఒక స్మగ్లర్ అరెస్టు
  • ద్విచక్రవాహనాన్న సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్

శ్రీకాళహస్తి మండలం ఆదవరం అటవీ పరిధిలో ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఒక స్మగ్లరును టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఒక ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ శ్రీనివాస్ అధ్వర్యంలో. ఎఎస్పీ శ్రీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఎఆర్ఎస్ఐ కే.మహేశ్వర నాయుడు టీమ్ స్థానిక ఎఫ్బీఓ పి. దామోదరరావుతో కలసి చెల్లూరు డ్యాం నుంచి బుధవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టారు. వీరు ఆదవరం అటవీ ప్రాంతంలోని తీర్ధాలపాల కోన వద్దకు చేరుకోగా, అక్కడ కొంత మంది వ్యక్తులు గుమికూడి కనిపించారు. వారిని సమీపించి చట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు టాస్క్ ఫోర్సు పోలీసులను చూసి పారిపోసాగారు. అయితే పోలీసులు ఒకరిని పట్టుకోగలిగారు. అతనిని కర్నాటకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ పరిసరాల్లో వెతకగా ఆరు ఎర్రచందనం దుంగలు, ఆ వ్యక్తి ఉపయోగించిన ద్విచక్ర వాహనం కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని, పట్టుబడిన వ్యక్తితో సహా తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన వ్యక్తిని డీఎస్పీ వీ. శ్రీనివాసరెడ్డి, ఎసీఎఫ్ జె.శ్రీనివాస్ విచారించారు. ఎస్ఐ సీహెచ్ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More https://youtu.be/-ka-0WqCpO8?si=-ZnBLXxQ7vyH86NS

Read More https://politicalhunter.com/peoples-movement-in-nandyal/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top