రేషన్ బియ్యం పేదలకు పరమాన్నమైతే.. ఎమ్మెల్యేస్ పాయింట్ అవినీతి అధికారికి లక్షల కాసులు కురిపించే ముడిసరుకు అయింది. ఆ డిప్యూటీ తహసిల్దార్ మాత్రం అక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తుంది.! శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా ఉందట అవినీతి అధికారి తీరు. నిరుపేదల బియ్యాన్ని అడ్డదారిలో బొకేస్తోంది. డీలర్లకు టేరు(తరుగు ) ఇవ్వకుండా క్వింటాల్కు రెండు కిలోలు నొక్కేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ! ఫలితంగా డీలర్లకు తక్కువ బియ్యం అందుతుంది. నొక్కేసిన బియ్యాన్ని వందల క్వింటాళ్లు నల్ల బజార్లో తరలిస్తూ లక్షల రూపాయలు కూడబెడుతుంది అన్న విమర్శలు డీలర్ లనుండి గట్టిగా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో 180 మూటల బియ్యం నల్ల బజారుకు తరలించినట్లు గుసగుసలు గుప్పుమంటున్నాయి దీనిపై ప్రశ్నిస్తే అధికారులు ఎక్కడ తమను ఇబ్బందులకు గురిచేస్తారని డీలర్లు కొంతమంది నోరు మెదపడం లేదు.
నన్నే ప్రశ్నిస్తారా మీకు బియ్యమే సప్లై చేయను అంటున్న అధికారి ..
మైదుకూరు ఎమ్మెల్యేస్ పాయింట్ పరిధిలో మైదుకూరు48,దువ్వూరు 37 రేషన్ షాపులు ఉన్నాయి. డీలర్ల ఇండెంట్ మేరకు చౌక దుకాణాలకు బియ్యాన్ని రవాణా చేస్తారు. మైదుకూరు ఎం ఎల్ ఎస్ పాయింట్ అధికారి చేతి వాటం ప్రదర్శిస్తూ ఉండడంతో ఆ ప్రభావం డీలర్ లపై అనంతరం కార్డుదారులపై పడుతున్నట్లు తెలుస్తోంది. మైదుకూరు పరిధిలోని 33, 44,45,31,32,25, 10 షాపుల రేషన్ డీలర్లకు బియ్యాన్ని ఇంకా సప్లై చేయలేదు. వీరందరూ కూడా తమకు రావలసిన టెర్ (తరుగు ) ఇవ్వాలని నిలదీయడం తో తమకు ఇంకా బియ్యాన్ని సప్లై చేయలేదని వాపోతున్నారు. ఒక సంచి బియ్యం ప్యాకెట్ నుండి 700 గ్రాములు నుండి1 కిలో వరకు తరుగు ఇవ్వాల్సి ఉండగా మైదుకూరు గోడౌన్ పాయింట్ అధికారి ఇవ్వడం లేదు అంటున్నారు డీలర్లు.
ధర్నాకు సిద్ధమైన రేషన్ డీలర్లు…
ప్రభుత్వం వచ్చిందని తమకు డీలర్ షిప్ వచ్చిందని సంతోషపడ్డ డీలర్లకు సంతోషం లేకుండా పోయింది. ఒకవైపు బ్యాక్లాగ్ తో తలలు పట్టుకుంటున్న డీలర్లు. మరోవైపు టెర్ (తరుగు )ఇవ్వకుండా తమ బియ్యాన్ని నొక్కేస్తూ నల్ల బజార్ తరలిస్తుండడంతో రేషన్ డీలర్లు తల్లలు కొట్టుకుంటున్నారు!. ఒక్కో డీలర్కు సగటు దాదాపుగా 150 నుంచి 200 మూటల బియ్యాన్ని దించుతారు. ఒక్కో మూటకు కేజీ చొప్పున తరుగు వేసుకున్న 150 కేజీల నుంచి 200 కేజీల బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. దీనిపై డీలర్ల సంఘం అధ్యక్షుడు చొక్కం శివ ఆధ్వర్యంలో డీలర్ లు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు.టెర్ గట్టిగా అడిగితే ఆ డీలర్కు ఒక్క మాట కూడా దించకుండా అధికారి ప్రవర్తిస్తుందంటూ రేషన్ డీలర్లు మండిపడుతున్నారు.ఆదివారం ఎం ఎల్ ఎస్ పాయింట్ వద్ద ధర్నా చేసేందు సిద్దమైనట్లు కొందరు డీలర్ చర్చించుకుంటున్నారు .ఇప్పటికైనా అధికారి తీరు మార్చుకొని డీలర్ లకు సక్రమంగా బియ్యాన్ని అందించేలా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..! Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV