ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల గ్రాండ్ లో క్రిస్మస్ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్
దోర్నాల మండల సమైక్య సేవకుల నిర్వహణలో “డిసెంబర్ 19 న జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరుగనున్న గ్రాండ్ క్రిస్మస్ యొక్క వాల్ పోస్టర్లను ఆంధ్ర రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ.ఆదిమూలపు సురేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం” జరిగింది.అదేవిధంగా నూతనంగా ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికచేయబడిన శ్రీ జంకె.వెంకటరెడ్డి గారిని దోర్నాల మండల పాస్టర్స్ యూనియన్ సేవకులు కలిసి శాలువాతో సన్మానించి గ్రాండ్ క్రిస్మస్ కి ఆహ్వానించడం జరిగింది.ఈ గ్రాండ్ క్రిస్మస్ కి రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ.ఆదిమూలపు సురేష్ గారు మరియు ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు శ్రీ.జంకె వెంకటరెడ్డి గారు తప్పకుండా పాల్గొంటామని తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమం లో పాస్టర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు యలకపాటి ఇశ్రాయేలు, ప్రెసిడెంట్ సింగా.రాజేష్, వైస్ ప్రెసిడెంట్ సింగా.యేసుదానం, సెక్రటరీ బుట్టి.దిలీప్ కుమార్, అడ్వయిజర్స్ మేడిపల్లి. అశోక్ కుమార్,పూర్ణకంటి.జేమ్స్, సింగా.ఏసన్న, యలకపాటి ప్రేమన్న పాల్గొనడం జరిగింది.