ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల :- తిమ్మాపురం ఏకలవ్య రెసిడెన్సి స్కూల్ లో ఆర్డిటి ఆధ్వర్యంలో బాల్య వివాహాల పైన జెండర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యాంసన్ పరంజ్యోతి వారి కళాబృందం నాటిక ప్రదర్శన చేయడం జరిగింది ముందుగా శ్యాంసన్ పరంజ్యోతి మాట్లాడుతూ ఆర్ డి టి ఆధ్వర్యంలో బాల్య వివాహాల పైన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇస్తూ ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం అన్నారు ఇక్కడ ఎక్కువ చెంచులు ఉండడం వారికి పెళ్లి మీద అవగాహన తెలియకపోవడం చిన్న వయసులో పెళ్లి చేయడం జరుగుతుంది అని తెలుసుకున్నాను జీవితమనేది బతకడానికే కానీ మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడేంతవరకు చదువుకోవాలి అన్నారు మహిళా అంటే ఇంటి పనులకు మగవారి సేవలకు పరిమితం కాకూడదు మహిళ అంటే ఒక పోలీసుగా ఒక డాక్టర్ గా ఒక యాక్టర్ గా ఒక రాష్ట్రపతిగా చేయగలరు అని నిరూపించారు మహిళా తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకోవాలి అని చెప్పారు ఏరియా టీమ్ లీడర్ నర్సింగ్ రావు మాట్లాడుతూ ఇక్కడ చెంచులలో చాలా ఎక్కువ మందికి చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి ఆర్డిటి ద్వారా కూడా కొన్ని గ్రామాలలో బాల్య వివాహాలు నిరోధించి ఆపడం జరిగింది బాల్యవివాహాలు ఆపిన పిల్లల్ని కూడా స్కూలుకు పంపడం జరిగింది. ఇలాంటి చిన్నపిల్లలకు ఆర్ డి టి ఎప్పుడు అండగా ఉంటుంది .
వారు చదువుకుంటామని ముందుకు వస్తే ఆర్ డి టి వారికి భరోసా ఇస్తుంది ఏకలవ్య స్కూల్ టీచర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం ఆర్డిటి చేస్తున్నందుకు చాలా సంతోషం ఎక్కువ బాగా చదివే పిల్లల ను బలవంతంగా కొట్టి గానీ చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు వారి తల్లిదండ్రులు అడిగితే మంచి సంబంధం వచ్చింది మంచి ఆస్తి ఉంది అని చెప్పి చిన్న పిల్లలకు పెళ్లి చేస్తున్నారు ముఖ్యంగా పెద్దవారిలో మార్పు తీసుకొని రావాలి ముఖ్యంగా ఆర్డిటి సంస్థ చిన్న పిల్లల కు పెళ్లి చేయకుండా తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ మరియు కల్చరల్ కోఆర్డినేటర్ నాగేష్ పురుషోత్తం సుకుంద నాయక్ ఆర్ డి టి సిబ్బంది రాజరత్నం శ్రీనివాస్ పాల్గొన్నారు