ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ “ప్రజా ఉద్యమం” నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రజల నుండి నాలుగు లక్షలకు పైగా సేకరించిన సంతకాల పత్రులని నంద్యాల జిల్లా కేంద్రం నుండి ర్యాలీగా వాహనంలో జెండా ఊపి తాడేపల్లి ప్రధాన కార్యాలయానికి సాగనంపిన వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారు మరియు పార్టీ ముఖ్య నేతలు..
జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సంతకాలన్నీ సేకరించడం జరిగింది..ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేయకూడదంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల కు, ప్రవేట్ మెడికల్ కాలేజీలకు ఉన్న భేదం ప్రైవేట్ హాస్పిటల్ లో డబ్బులు చెల్లించి వైద్యం చేపించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు!
ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతా గారు, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి గారు, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి గారు, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి గారు, దారా సుధీర్ గారు, బుడ్డా శేషా రెడ్డి గారు, భూమా కిషోర్ గారు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..
Read Morehttps://www.facebook.com/share/p/16hdXzYemM/
Read Morehttps://politicalhunter.com/prashanth-who-donated-his-organs/











