- వన్యప్రాణుల సంరక్షణ గాలిలో దీపంలా
- రిజర్వు ఫారెస్టులో మైనింగ్ క్వారీలతో పరుగులు తీస్తున్న వన్యప్రాణులు
- బ్లాస్టింగ్లతో అటవీ వనాలను వదలి జనసంచారంలోకి వన్య ప్రాణులు
- పాణ్యం సెక్షన్ రామతీర్థం బీట్ లో అక్రమ మైనింగ్ తవ్వకాలపై
అటవీశాఖ అధికారుల నిఘా విఫలం - వన్యప్రాణుల షేడ్యుల్ (1)కు విరుద్దంగా అటవీలో తవ్వకాలు
- నిద్రమత్తు వదలని అటవీశాఖ అధికారులు
- వైల్డ్ లైఫ్ యాక్టు ప్రకారంగా జాతీయ పక్షి నెమలి ప్రశ్నార్థకమే
- యెద్దెచ్చగా అటవీ భూములను కబ్జా చేసుకుంటున్న అధికార పార్టీ నాయకులు
Article by ———- సగినాల రవి కుమార్ – 8309888954
AP: రిజర్వు ఫారెస్టులో జాతీయ పక్షి నెమలికి రోజు రోజుకు రక్షణ కరువైపోతుంది. ఇప్పుడిప్పుడే అడవిని సంరక్షణ చేసి వన్యప్రాణులను కాపాడుకునేందుకు అటవీశాఖ అధికారులు చట్టాలను కఠినంగా అమలు చేస్తూ వన్యప్రాణులను వేటాడిన అటూ వైపు చూసిన అనేక చట్టాలను ప్రయోగిస్తారు. అందులో బాగంగానే కర్నూలు జిల్లాలోని అటవీ డివిజన్లో జాతీయ పక్షి నెమలికి రక్షణ కరువై వన్యప్రాణుల సంరక్షణ గాలిలో దీపంలా మారుతుంది. ఇదంతా కేవలం అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆటవీ భూములను ఎద్దెచ్చగా కబ్జా చేసుకోని ఏకంగా అక్రమంగా రిజర్వు పారెస్టులో మైనింగ్ క్వారీలను ఏర్పాటు చేసి అక్కడ తవ్వకాలు జరుపు తున్న నేపథ్యంలో బ్లాస్టింగ్ చేయడంతో వన్య ప్రాణులు జాతీయ పక్షి అయిన నెమలి మందాలు పరుగులు తీసి జనసంచారంలో సంచరిస్తున్నాయి.
రిజర్వు పారెస్టులో వన్యప్రాణులను సంరక్షణ చేయాల్సిన అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల షేడ్యుల్ (1)కు విరుద్ధంగా ఆటవీలో తవ్వకాలను బ్లాస్టింగ్ చేసిన అటవీశాఖ అధికారులు నిద్రమత్తు వదలడంలేదు. వైర్ప్ యాక్టు ప్రకారంగా జాతీయ పక్షి నెమలి సంచారం జిల్లాలో ప్రశ్నార్ధకంగానే మారింది. తప్పునుకప్పి పుచ్చుకునేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు ఈ విషయంను రహస్యంగానే ఉంచారు. ఎట్టకేలకు అవినీతి అక్రమ మైనింగ్ క్వారీలపై మూడు శాఖల అధికారులు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహ రించారనే వివిద కారణాలు తెలియాల్సి ఉంది.
డేంజర్ లో జాతీయ పక్షి నెమలి
ప్రస్తుతం జిల్లాలోని కర్నూలు రేంజ్ లో పాణ్యం సెక్షన్ రామతీర్థం బీట్ పరిథిలో అటవీశాఖ అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ క్వారీ ఏర్పాటు చేసుకున్న అధికార పార్టీ నాయకులపై చర్యలు చేపట్టాల్సిన అసవరం ఎంతైన ఉంది. అయితే రిజర్వు ఫారెస్టులో జరిగే అవినీతి అక్రమాలపై వెలుగులోకి వస్తే తమ ఉద్యోగాలకు భద్రత లేకుం డా పోతుందనే విషయంను గోప్యంగా ఉంచుతూ అడవి సంపదను కొల్లగొట్టే విదంగా అటవీశాఖ అధికారులే ఇందుకు మూల కారణంగా మారారు. పచ్చదనం పర్యావరణం వన్యప్రాణుల సంరక్షణ చేయాల్సిన ఆటవీశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయంను తీసుకెళ్లేందుకు రిజర్వు పారెస్టు డివిజన్ అధికారి ఎలాంటి సమాచారం ఇవ్వకుం దానే ఇదంతా క్షేత్ర స్థాయి అధికారి నుంచి క్రింది స్థాయి అధికారుల వరకు కొనసాగుతుంది. రాజకీ య నాయకులు అందిస్తున్న మామ్యులకు అల వాటు పడి మా బందువులో కూడా పేరు మోసిన ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రివర్యులు ఉన్నారం టూ అటవీ హక్కుల చట్టంను ఉల్లంఘన చేస్తూ దాడులు చేసి కేసులు నమోదు చేయాల్సిన అటవీ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోబులు నింపుకుం టున్నట్లు సమాచారం.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
ప్రస్తుతం జిల్లాలో కోట్లాది రూపాయాల ఆక్రమ మైనింగ్ వ్యాపారానికి ఇంటి దొండలే కొమ్ముకాస్తున్నారనే విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. జాతీయ పక్షి నెమలితో పాటు తోడేళ్లు, నక్కలు గుంట నక్కలు, అడవిపందులు, ఇతర జాతులు వన్యప్రాణులు ఈ రిజర్వు పారెస్టు లోనే సంచరిస్తున్నాయి. అక్రమ మైనింగ్ క్వారీల పేరుతో బ్లాస్టింగ్లు చేయడంతో వన్యప్రాణులు రైతన్నలు సాగు చేసుకుంటున్న వంట పొలాలపై మొగ్గు చూపు ఎన్నో వక్షులు, జంతువులు మృత్యువాత వడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. జాతీయ పక్షి నెమలికి ఆహ్లాదకరమైన వాతవరణం ఉండేందుకు రిజర్వు పారెస్టులో ప్రశాంతంగా ఉన్న పక్షికి ఒక్కసారిగా మైనింగ్ అక్రమార్కులు బ్లాస్టింగ్ చేయడంతో ఆ విషవాయువుతో ఆ వక్తులు అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం సమాచారం. గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్ పై ఆటవీశాఖ అధికారులు విఫలం చెందారన్నదానికి ఇది ఒక నిదర్శనం.
అక్రమ మైనింగ్లపై ఆటవీశాఖ నిర్లక్ష్య దోరణి
జిల్లాలోని వన్యప్రాణి విభాగం అటవీ డివిజన్లలో రాత్రింబవళ్ళు సంరక్షణ చేయాల్సిన ఆటవీశాఖ అధికారులు తూతూ మంత్రంగా విధి నిర్వహాణ చేయడంతో.. అక్రమ మైనింగ్ వ్యాపారులు చేలరేగిపోయి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రుల అండదండలు పుష్కలంగా ఉండడంతో రాజకీయ నాయకులు, ఆటవీశాఖ అధికారులు చేతులు కలపి మేము ఏమిచేసిన మమ్మల్నను ప్రశ్నించే వారు ఎవరు లేరంటూ ఆటవీ భూములను కాపాడాల్సిన అధికారులే నాయకులకు ప్రజాప్రతినిధులకు కొమ్ముకాయడంతో జిల్లాలో అటవీశాఖ భూములను ఎధేచ్చగా అక్రమ వ్యాపారులు చేతులు మార్చుకుంటూ అటవీ భూములను మింగేస్తున్నారు. ఏదిఏమైన్నప్పటికి వన్యప్రాణుల సంరక్షణ కాపాడుతూ రిజర్వు పారెస్టును కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు నిర్లక్ష్య దోరణి వీడితే ఎంతటి వారిపైనైనా కేసులు నమోదు చేసే చట్టాలు కేవలం ఆటవీశాఖకే ఉంది. దీని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతోనే మైనింగ్ అక్రమార్కులు రెచ్చిపోతు తమకు ఉన్న ప్రజాప్రతినిధుల బలంతో అడవినే నాశనం చేసే పనిగా ముందుకు వెళ్తున్నారు.
ఇప్పటికైన అటవీశాఖ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి వర్యావరణంను కాపాడుతూ రిజర్వు పారెస్టులో నివశించే వన్యప్రాణుల సంరక్షణ చేయాల్సిన అవసరం ఎంతైన అటవీశాఖ అధికారులపై ఉంది. జిల్లాలో అటవీశాఖ భూములను కబ్జా చేసి ఏకంగా అధికారులు ఏర్పాటు చేసిన ట్రెంచ్, సరిహద్దులను కనుమరుగు చేస్తూ ఏకంగా అడవిలోనేమక్కం వేసి నాయకులు జోరుగా అక్రమ మైనింగ్ వ్యాపారంను. కొనసాగిస్తున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడు తున్న అటవీశాఖ సిబ్బందిపై చర్యలు తీసుకో వాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు ఉన్నప్పటికి మా అధికారులు ఎలాంటి తప్పిదాలు చేయలే దంటూ ఆటవీశాఖలో ఉన్నతాధికారుల అండదం డలతో అవినీతి పరులకు కొమ్ముకాస్తూ అడవిసం వదను కొల్లగొట్టే విదంగా వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్లపై ఆటవీశాఖ విజులెన్సు అధికారులు, పిసిసిఎఫ్, నేషనల్ వైల్డ్ లైఫ్ అధికారులు పూర్తి స్థాయిలో సమాచారంను సేకరించి అక్రమార్కులపై వేటు వేస్తారా లేదా అనే విషయంను వేచి చూద్దాం.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV